రాబోయే వందేళ్లకు అభివృద్ధి ప్రణాళిక రెడీ చేస్తున్నాం అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఎన్నికల వరకే రాజకీయాలు..ఇప్పుడు మా దృష్టి అంతా అభివృద్ధి పైనే అన్నారు రేవంత్. హైదరాబాద్ హోటల్ వెస్టిన్‌లో సీఐఐ తెలంగాణ ఆధ్వర్యంలో విద్య, నైపుణ్యాభివృద్ధి – వ్యవస్థాపక అవకాశాలు అంశంపై నిర్వహించిన సమావేశంలో రేవంత్ పాల్గొని ప్రసంగించారు.
ప్రపంచ దేశాలతో తెలంగాణ పోటీ పడాలన్నదే తమ విధానం అని రేవంత్ స్పష్టం చేశారు. రాజకీయాలు ఎలా ఉన్నా కేసీఆర్ హైదరాబాద్‌ను అభివృద్ధి చేశారని…సీఆర్ కంటే ముందున్న ముఖ్యమంత్రులు వైఎస్, చంద్రబాబు కూడా హైదరాబాద్‌ను డెవలప్ చేశారని తెలిపారు. స్కిల్ డెవలప్‌మెంట్‌లో జాయిన్ అయిన విద్యార్థులకు డిగ్రీ సర్టిపికెట్స్ ఇవ్వబోతున్నాం అని…. తెలంగాణలో డ్రైపోర్ట్ ఏర్పాటు చేస్తాం అన్నారు.
అభివృద్ధి విషయంలో తమ ప్రభుత్వానికి ఎలాంటి బేషజాలు లేవని తెలిపారు. 64 ఐటీఐలను స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లుగా రూ.2000 కోట్లతో అభివృద్ధి చేయబోతున్నాం అని తెలిపారు.
Also Read:ఇంగువతో ఆరోగ్య ప్రయోజనాలు..