హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో క్రిస్మస్ వేడుకలకు హాజరయ్యారు సీఎం రేవంత్ రెడ్డి.చిన్నారులకు క్రిస్మస్ కానుకలు పంపిణీ చేశారు సీఎం. తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలకు భారీగా ఏర్పాట్లు చేశారు అధికారులు. వేడుకలకు మంత్రి పొన్నం ప్రభాకర్, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ హాజరయ్యారు.
Also Read:పెదవులు పగిలితే.. ఇలా చేయండి!
తెలంగాణలో సర్వమతాలకు సమానమైన సంపూర్ణ రక్షణ కల్పించడం ప్రజా ప్రభుత్వ విధానమని చెప్పారు సీఎం రేవంత్. సర్వమత సమానత్వంలో ఎవరైనా ఇతర మతాలను కించపరిచే చర్యలకు పాల్పడితే ప్రభుత్వం సహించదని స్పష్టం చేశారు.
క్రిస్‌మస్ పండుగను పురస్కరించుకుని ఎల్పీ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి కేక్‌ను కట్ చేసి, అందరికీ క్రిస్‌మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, నిన్ను నువ్వు ప్రేమించినట్టుగానే పొరుగువారిని కూడా ప్రేమించమని క్రీస్తు ప్రబోధనల్లో సమస్త అంశాలు సంక్షిప్తమై ఉన్నాయని అన్నారు.
విద్య, వైద్యం విషయంలో క్రిస్టియన్ మిషనరీలు ప్రభుత్వాలతో పోటీ పడి నిరుపేదలకు సేవలు అందిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాయని అభినందించారు. సమాజ నిర్మాణంలో ఆదర్శవంతులుగా, విద్యార్థినీ విద్యార్థులను ఒక బాధ్యతగల పౌరులుగా తీర్చిదిద్దడంలో ఆదర్శంగా నిలబడ్డారని అన్నారు.