శ్రీవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి

24
- Advertisement -

తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. బుధవారం ఉదయం తిరుమలకు చేరుకున్న రేవంత్… తన మనవడి పుట్టువెంట్రుకల మొక్కు చెల్లించారు. అనంతరం ఉదయం 8.30గంటలకు వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి రేవంత్ రెడ్డి శ్రీవారిని దర్శించుకున్నారు.

తెలంగాణ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తరువాత తొలిసారి శ్రీవారి దర్శనానికి వెళ్లిన రేవంత్ రెడ్డికి టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి స్వాగతం పలికారు. దర్శన ఏర్పాట్లు దగ్గరుండి పర్యవేక్షించారు. దర్శనానంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు అర్చకులు.

Also Read:TTD: పద్మావతి అమ్మవారి వసంతోత్సవాలు

- Advertisement -