ప్రతి ఏటా తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవాలు

2
- Advertisement -

ప్రతి యేటా డిసెంబర్ 9న తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవం నిర్వహిస్తామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అసెంబ్లీలో మాట్లాడిన సీఎం…తెలంగాణ ప్రజల 60 ఏళ్ల ఆకాంక్షను సోనియా నెరవేర్చారు అన్నారు. డిసెంబర్ 9న తెలంగాణ ప్రజలకు శుభదినం…సోనియా గాంధీకి 78వ జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు.

ఆరు దశాబ్దాలుగా రకరకాల రూపాల్లో ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను ప్రజలు తెలియజేశారు అన్నారు రేవంత్ రెడ్డి. తెలంగాణ సాధన కోసం జరిగిన పోరాటంలో ఎంతో మంది అమరులయ్యారు..ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ఆనాడు సోనియాగాంధీ ఒక ఉదాత్తమైన నిర్ణయం తీసుకున్నారు అన్నారు. తెలంగాణ ప్రక్రియను ప్రారంభిస్తున్నామని 2009, డిసెంబర్ 9న ప్రకటించారు…అందుకే డిసెంబర్ 9కి ఎంతో ప్రాధాన్యత ఉందన్నారు.

ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఉద్యమ సందర్భంలో యువత గుండెలపై రాసుకున్న టీజీ అక్షరాలను వాహనాలకు పెట్టుకున్నాం అన్నారు. ఉద్యమ కాలంలో స్ఫూర్తిని నింపిన జయ జయహే తెలంగాణ గీతాన్ని మన రాష్ట్ర గీతంగా ప్రకటించుకున్నాం.. తల్లి ప్రతిరూపమే ఉండాలని మేధావులు సూచించారు..వారి సూచనల మేరకే తెలంగాణ తల్లిని చూస్తే మన తల్లిని చూసిన స్ఫురణ కలిగేలా బహుజనుల తెలంగాణ తల్లిని ఇవాళ ప్రతిష్ఠించుకోబోతున్నాం అన్నారు. నాలుగుకోట్ల తెలంగాణ సమాజమంతా ఏకమై ఇవాళ పండగ వాతావరణంలో ఉత్సవాలను నిర్వహించుకోబోతున్నాం అన్నారు.

Also Read:సీఎం రేవంత్‌తో సిద్ధు జొన్నలగడ్డ

- Advertisement -