శాసనమండలి, శాసనసభలో పోటీ పడి స్పీచ్ ఇవ్వాలన్న స్ఫూర్తిని రోశయ్య మాకు ఇచ్చారు అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మాజీ ముఖ్యమంత్రి రోశయ్య 3 వ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన సీఎం..ఉమ్మడి రాష్ట్రంలో ఆర్థిక మంత్రి గా రోశయ్య క్రమశిక్షణ పాటించడం వల్లనే 16 వేల కోట్ల మిగులు బడ్జెట్ తో తెలంగాణ ఏర్పడిందన్నారు. చుక్క రామయ్య,ప్రొఫెసర్ నాగేశ్వర్, రోశయ్య లాంటి వారి మధ్య శాసనమండలిలో ఎమ్మెల్సీ గా మాట్లాడేందుకు నేను భయపడ్డాను..నీటి పారుదల శాఖ పైన మండలిలో నేను మాట్లాడినప్పుడు నన్ను తన ఛాంబర్ కు పిలిపించుకొని ప్రోత్సహించారు అన్నారు.
ప్రతిపక్ష సభ్యుడినైనప్పటికి మండలి గౌరవం పెంచాలన్న ఉద్దేశంతో రోశయ్య నన్ను ఆనాడు ప్రోత్సహించారు..ప్రతిపక్షం లో ఉన్నప్పుడు ప్రశ్నించాలి.. పాలక పక్షంలో ఉన్నప్పుడు పరిష్కరించాలని రోశయ్య నాకు సూచించారు అన్నారు. చట్టసభల్లో అనాటి స్పూర్తి కొరవడింది..ప్రతిపక్షాలకు సభలో మాట్లాడే అవకాశం ఇవ్వొద్దన్నట్లుగా పరిస్థితులు తయారయ్యాయి అన్నారు.
రోశయ్య కుటుంబం రాజకీయాల్లో లేదు…సీఎంగా, గవర్నర్ గా,వివిధ హోదా ల్లో 50 యేళ్ల పైగా రాజకీయాల్లో గొప్పగా రాణించారు అన్నారు. తమిళనాడు గవర్నర్ గా ఎవరు వెళ్లినా వివాదాల్లో కూరుకుపోతుంటారు..కాని రోశయ్య అక్కడ వివాదాలు లేకుండా రాణించారు అన్నారు. అ నాటి ముఖ్యమంత్రులకు రోశయ్య కుడి భుజం లా వ్యవహారించడం వల్లనే వారు సమర్థంగా పనిచేశారు…రోశయ్య లాంటి సహచరులు ఇప్పుడు లేకపోవడం పెద్ద లోటు అన్నారు.
Also Read:మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్
ప్రతిపక్షాల నుంచి వచ్చే ప్రశ్నల నుంచి ప్రభుత్వాన్ని రోశయ్య కంచె వేసి కాపాడేవారు..నెంబర్ 2 స్థానంలో రోశయ్య ఉండాలని ఆ నాటి ముఖ్యమంత్రులు కోరుకున్నారు అన్నారు. ముఖ్యమంత్రి స్థానం కోసం ఏ నాడు రోశయ్య తాపత్రయపడలేదు..పార్టీ పట్ల ఆయన నిబద్ధత కారణంగానే క్లిష్ట సమయంలో రోశయ్యను ముఖ్యమంత్రి చేయాలని సోనియా గాంధీ నిర్ణయించారు అన్నారు. రోశయ్య నిబద్దత కారణంగానే అన్ని హోదాలు ఆయన ఇంటికి వచ్చాయి… సభలో సమస్యలను వ్యూహాత్మకంగా ఎదుర్కొవాలంటే రోశయ్య ఉండాలనే ముద్ర ఆయన బలంగా వేశారు అన్నారు.
రాష్ట్ర ఆర్థిక ఎదుగుదల ఆర్యవైశ్యుల చేతిలో ఉంది.. తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్లు కావాలి.. ఆర్య వైశ్యుల వ్యాపారాలకు ఎలాంటి అనుమతులైనా ప్రభుత్వం సకాలంలో ఇస్తుందన్నారు. రాజకీయాల్లో ఆర్య వైశ్యులకు సముచిత స్థానం ఇస్తాం…నేను హైదరాబాద్ వ్యక్తినని గతంలో రోశయ్య స్పష్టం చేశారు…హైదరాబాద్ నగరంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున రోశయ్య విగ్రహం ఏర్పాటు చేస్తాం అన్నారు. రోశయ్య విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ద్వారా సమాజానికి మంచి స్పూర్తి ఇచ్చినట్లైవుతుందన్నారు.