మత సామరస్యాన్ని కాపాడుతాం:సీఎం రేవంత్

27
- Advertisement -

మత సామరస్యాన్ని కాపాడుతూ మా ప్రభుత్వం ముందుకెలుతుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన రేవంత్…డిసెంబర్ లో మిరాకిల్ జరగబోతుందని నేను ముందుగానే చెప్పానన్నారు.

ప్రపంచానికే డిసెంబర్ నెల మిరాకిల్ మంత్…ఎందుకంటే యేసు ప్రభువు జన్మదినం అన్నారు. సెక్యులర్ ప్రభుత్వం ఉండాలని ప్రజలు కాంగ్రెస్ కు అధికారం ఇచ్చారు…మొన్న కర్ణాటక.. నిన్న హిమాచల్ ప్రదేశ్… నేడు తెలంగాణలో సెక్యులర్ ప్రభుత్వం ఏర్పడిందన్నారు. ఇంతకంటే మరో గురుతర బాధ్యత మీపై ఉంది..రాబోయే లోక్ సభ ఎన్నికల్లో ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగరాలన్నారు.

ప్రస్తుతం దేశ రక్షణ ప్రమాదంలో పడిన పరిస్థితి ఉందని…మణిపూర్ అల్లర్ల సందర్భంలో ఏం జరిగిందో మనం చూశాం అన్నారు.కనీసం మణిపూర్ వాసులను ప్రధాని పరామర్శించేందుకు ప్రయత్నించలేదని…మణిపూర్ లాంటి ఘటనలు దేశంలో ఎక్కడా జరగకుండా చూడాల్సిన బాధ్యత దేశ ప్రజలపై ఉందన్నారు.

నిస్సహాయులకు సహాయం అందించండం మా ప్రభుత్వ ధ్యేయం అని….అర్హత కలిగిన వారికి అవకాశాలు కల్పించడం మా ప్రభుత్వ లక్ష్యం అన్నారు. ఈ వేదికగా నేను మీకు మాట ఇస్తున్నా..తెలంగాణలో ఏర్పడ్డ ఇందిరమ్మ రాజ్యం… పేదల అభివృద్ధికి పాటు పడుతుందన్నారు. సంక్షేమ పథకాలను ప్రతీ పేదకు చేరేలా చూస్తాం అని…మేం పాలకులం కాదు.. సేవకులం అన్నారు. ఏసు క్రీస్తు మాకు ఆదర్శం…బాధ్యతను మరవకుండా పనిచేస్తూ ముందుకెళతాం అన్నారు.

Also Read:జామకాయతో ఉపయోగాలు తెలుసా?

- Advertisement -