దేశానికి పెద్దన్న కానీ తెలంగాణపై నిషేధం:మోడీపై సీఎం ఫైర్

21
- Advertisement -

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో తెలంగాణ అనే పదాన్ని నిషేధించారని మండిపడ్డారు సీఎం రేవంత్ రెడ్డి. మీడియాతో మాట్లాడిన సీఎం.. వికసిత్ భారత్ 2047 బడ్జెట్ లో తెలంగాణపై కేంద్రం కక్షపూరితంగా వ్యవహరించిందన్నారు. స్వయంగా నేనే మూడుసార్లు ప్రధానిని కలిసి తెలంగాణ అభివృద్ధికి నిధులు ఇవ్వాలని కోరా,వివక్ష లేని, వివాదాలు లేని సత్సంబంధాలు ఉండాలని, అభివృద్ధికి సహకరించాలని కోరాం అన్నారు.

రాష్ట్రానికి వచ్చినప్పుడు అభివృద్ధి విషయంలో పెద్దన్నలా వ్యవహరించాలని ప్రధానికి చెప్పాం..వివక్షను తొలగించి నిధులు కేటాయించాలని కోరాం కానీ బడ్జెట్‌లో తెలంగాణకు పూర్తిగా అన్యాయం జరిగిందన్నారు. తెలంగాణ అనే పదాన్ని పలకడానికే కేంద్రం ఇష్టపడటంలేదు…వారి మనసులో ఇంత కక్ష ఉందని తెలంగాణ ప్రజలు అనుకోలేదు అన్నారు. పునర్విభజన చట్టాన్ని ప్రస్తావిస్తూ ఏపీకి కేంద్రం నిధులు కేటాయించిందన్నారు.

మరి పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణకు నిధులు ఎందుకు కేటాయించలేదు?,మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధికి, రీజనల్ రింగ్ రోడ్డుకు… ఏ విషయంలోనూ తెలంగాణకు కేంద్రం నిధులు కేటాయించలేదు అన్నారు. ఐటీఐఆర్ గురించి ప్రస్తావించలేదు,సబ్ కా సాత్ సబ్ కా వికాస్ అనేది బోగస్ నినాదంగా మార్చారు అన్నారు. వికసిత్ భారత్ లో తెలంగాణ భాగం కాదని ప్రధాని భావిస్తున్నారు…ఇది వికసిత్ భారత్ బడ్జెట్ కాదు.. ఇది కుర్చీ బచావో బడ్జెట్ అన్నారు. బీహార్, ఏపీకి తప్ప ఇతర రాష్ట్రాల అభివృద్ధికి నిధులు కేటాయించలేదు…ఇంతటి వివక్ష, కక్షపూరిత వైఖరి ఎప్పుడూ చూడలేదు అన్నారు.

బీజేపీ కి తెలంగాణ నుంచి ఓట్లు సీట్లు మాత్రమే కావాలి.. కానీ అభివృద్ధి పట్టదా?,బడ్జెట్ లో తెలంగాణకు జరిగిన అన్యాయానికి కిషన్ రెడ్డి, బాధ్యత వహించాలన్నారు. కేంద్ర వైఖరికి నిరసనగా కేంద్ర మంత్రివర్గం నుంచి కిషన్ రెడ్డి రాజీనామా చేసి బయటకు రావాలని డిమాండ్ చేశారు రేవంత్. తెలంగాణకు ఐఐఎం ఇవ్వం అని కేంద్రం చెప్పినా… కిషన్ రెడ్డి ఎందుకు మంత్రివర్గంలో కొనసాగాలి?,ప్రధానిని మేం పెద్దన్నగా భావిస్తే… ఆయన దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు.కేవలం క్విడ్ ప్రో కో విధానంలో కుర్చీ కాపాడుకునేందుకే ప్రధాని బడ్జెట్ లో ప్రాధాన్యతనిచ్చారు…తెలంగాణ హక్కుల కోసం పార్లమెంట్ లో కాంగ్రెస్ నిరసన తెలుపుతుందన్నారు.

బీజేపీకి తెలంగాణలో నూకలు చెల్లినట్లే..కిషన్ రెడ్డి మౌనం, బానిస మనస్తత్వంతో తెలంగాణకు అన్యాయం జరుగుతోందన్నారు.మంత్రి పదవి కోసం తెలంగాణ ఆత్మగౌరవాన్ని మోదీ వద్ద తాకట్టు పెట్టొద్దు..పోలవరంకు నిధులు ఇచ్చినప్పుడు.. తెలంగాణలో పాలమూరు ఎత్తిపోతలకు ఎందుకు నిధులు ఇవ్వరో కిషన్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

- Advertisement -