వరద నష్టంపై కేంద్రం సాయం కోరుతాం: రేవంత్

10
- Advertisement -

వరద నష్టం పైన కేంద్రానికి సమగ్ర నివేదిక ఇవ్వాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. వర్షాలు, వరద సాయంపై సిఎం సమీక్ష నిర్వహించారు. భారీ వర్ష సూచన ఉన్న ప్రాంతాల్లో అధికారులు అలర్ట్ గా ఉండాలన్నారు. కలెక్టరేట్ ల్లో కాల్ సెంటర్ ఏర్పాటు చేయాలని.. కమాండ్ కంట్రోల్ సెంటర్ లో వ్యవస్థ ను సన్నద్దంగా ఉంచుకోవాలన్నారు

అత్యవసర సేవల కోసం రాష్ట్రంలో ని 8 పోలీస్ బెటాలియన్ల కు ఎన్డీఆర్ఎఫ్ తరహా లో శిక్షణ ఇవ్వాలన్నారు. వరదల కారణంగా చనిపోయిన వారి కుటుంబాలకు 5 లక్షల ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించారు. ప్రజలకు జరిగిన నష్టం పై తక్షణమే అధికారులు స్పందించాలని..వరదల్లో చనిపోయిన పశువులు, మేకలు,గొర్రెల కు పరిహారం పెంచాలన్నారు.

వరద నష్టం పైన కేంద్రానికి సమగ్ర నివేదిక ఇవ్వాలని.. తక్షణమే కేంద్ర సాయం కోరుతు లేఖ రాయాలన్నారు. జాతీయ విపత్తుగా పరిగణనలోకి తీసుకోవాలని కేంద్రాన్ని కోరుతు లేఖ రాయాలని..వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాలని కోరుతు ప్రధాని నరేంద్ర మోదీని కోరుతామని తెలిపారు రేవంత్. వరద ప్రభావిత జిల్లాలు ఖమ్మం, భద్రాద్రి కొత్త గూడెం, మహబూబాబాద్, సూర్యాపేట కలెక్టర్ల లకు తక్షణ సాయం కోసం 5 కోట్లు మంజూరు చేశారు.

Also Read:వరద పరిస్థితిపై కేంద్ర హోంమంత్రి ఆరా

- Advertisement -