ఫుట్‌బాల్‌ ఆడిన సీఎం రేవంత్ రెడ్డి..

30
- Advertisement -

తెలంగాణ పార్లమెంట్ ఎన్నిలకు సర్వం సిద్ధమైన సంగతి తెలిసిందే. ఇక నెల రోజులుగా లోక్ సభ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి…హైదరాబాద్‌లో ఉదయం విద్యార్థులతో కలిసి సరదాగా ఫుట్ బాల్ ఆడారు.

గచ్చిబౌలిలో విద్యార్థులతో కలిసి ఫుట్ బాల్ ఆడారు. వారితో పోటీ పడుతూ గోల్ కోట్టేందుకు రేవంత్ ప్రయత్నించారు.ఎన్ఎస్ యూఐ ఆధ్వర్యంలో గచ్చిబౌలి మైదానంలో ఫుట్ బాల్ టోర్నీని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ విద్యార్థులతో కలిసి రేవంత్ రెడ్డి ఫుట్ బాల్ ఆడారు. బంతిని గోల్ చేసేందుకు విద్యార్థులతో కలిసి పోటీపడ్డారు.

ఆట మధ్యలో సీఎం షూ పాడైపోగా అయినా మైదానంను వీడకుండా షూ లేకుండానే సాక్స్ లతో ఫుట్ బాల్ ఆడారు. రేవంత్ ఫుట్ బాల్ ఆడిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Also Read:సత్యదేవ్ కెరీర్‌లోనే బెస్ట్ ఓపెనింగ్స్‌

- Advertisement -