రాజీవ్ ఆరోగ్యశ్రీని రూ.10 లక్షలకు పెంచాం:రేవంత్‌

8
- Advertisement -

తెలంగాణ ప్రభుత్వం ప్రజల ఆరోగ్య భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ కీలక నిర్ణయాలు తీసుకుంటోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని మరింత విస్తరించి, ఆర్థిక పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచినట్లు ఆయన వెల్లడించారు. దీంతో పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు అధిక వైద్య ఖర్చుల భారం తగ్గుతుందని ఆయన పేర్కొన్నారు.

ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పరిస్థితిని పూర్తిగా మార్చామని చెప్పారు.ఇప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ మరియు ఆరోగ్యశ్రీ పథకాల కోసం ఎవరైనా సులభంగా దరఖాస్తు చేసుకునే విధంగా పారదర్శక విధానాలను అమలు చేస్తున్నామని సీఎం వివరించారు. ప్రజలకు త్వరితగతిన సహాయం అందేలా చర్యలు తీసుకున్నామని, మధ్యవర్తుల పాత్రను తగ్గించామని తెలిపారు.

అధికారంలోకి వచ్చిన 27 నెలల్లోనే రాష్ట్ర ప్రభుత్వం ద్వారా రూ.2,046 కోట్లను సీఎం రిలీఫ్ ఫండ్ కింద పంపిణీ చేసినట్లు సీఎం వెల్లడించారు. ఇది ప్రజల పట్ల ప్రభుత్వ కట్టుబాటును చూపించే విషయం అని ఆయన అన్నారు. ఈ చర్యలతో రాష్ట్రంలో ఆరోగ్య సేవలు మరింత అందుబాటులోకి వచ్చాయని, ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ఇది ఎంతో ఉపయోగపడుతుందని సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రభుత్వం చేపట్టిన ఈ మార్పులు ప్రజల జీవితాల్లో సానుకూల ప్రభావం చూపుతాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

ALso Read:IPL: క్యాచ్‌లపై కొత్త కఠిన నిబంధనలు!

- Advertisement -