ఓవైసీకి సమయమిచ్చాం..విద్యార్థుల కోసమే!

8
- Advertisement -

అక్రమ నిర్మాణాల కూల్చివేత విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఒవైసీ కాలేజీ విషయంలో విద్యాసంవత్సరం నష్టపోతుందని సమయం ఇచ్చాం అని తెలిపారు. గండిపేట ఫాతిమా కాలేజీ కూల్చివేతలపై స్పందించిన రేవంత్..విద్యార్థుల భవిష్యత్ ముఖ్యం కాబట్టి ఆ బిల్డింగ్ కూల్చాలా వద్దా అని ఆలోచిస్తున్నాం అన్నారు.

మరోవైపు రెవెన్యూ అధికారులు నోటీసులు ఇవ్వడంతో హైకోర్టు ను ఆశ్రయించారు MLRIT సంస్థల అధినేత మర్రి లక్ష్మణ్ రెడ్డి. దుండిగల్‌లోని MLRIT, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కాలేజీలకు రెవెన్యూ అధికారుల నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. చిన్న దామెర చెరువు ఆక్రమించి FTL, బఫర్ జోన్ లో నిర్మాణాలు చేశారని నోటీసులు ఇచ్చారు. ఏడు రోజుల్లో నిర్మాణాలు తొలగించాలని.. లేకుంటే చర్యలు తీసుకుంటామని నోటీసుల్లో పేర్కొన్నారు అధికారులు. దీంతో రెవెన్యూ అధికారులు కాలేజీ కూల్చకుండా స్టే ఇవ్వాలని పిటిషన్ వేశారు మర్రి లక్ష్మణ్ రెడ్డి.

Also Read:KTR:రాజీవ్ గాంధీపై రేవంత్‌ది కపట ప్రేమ

- Advertisement -