కులగణన విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకుంది అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మీడియాతో మాట్లాడిన రేవంత్… కులగణనపై నాటి కాంగ్రెస్ ప్రభుత్వం సమాచారాన్ని సేకరిస్తే మోడీ ప్రధాని అయ్యాక ఆ నివేదికను కాలగర్భంలో కలిపేశారు అన్నారు.
ఈ 11 ఏళ్లలో కులగణన విషయంలో మోడీ ఎలాంటి ప్రయత్నం చేయలేదు… రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ మేరకు తెలంగాణలో ఎలాంటి వివాదాలు లేకుండా విజయవంతంగా కులగణన పూర్తి చేసి దేశానికే ఆదర్శంగా నిలిచాం అన్నారు.
తెలంగాణ ప్రజలు, బలహీన వర్గాల తరఫున రాహుల్ గాంధీకి ధన్యవాదాలు చెప్పారు. అలాగే కులగణనకు అంగీకరించిన ప్రధాన మోడీకి ధన్యవాదాలు చెప్పారు. కులగణన విషయంలో మాకు కొంత అనుభవం ఉంది.. కేంద్రానికి కులగణన విషయంలో కొన్ని సూచనలు చేస్తున్నాం అన్నారు. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో కులం ఒక్కో జాబితాలో ఉంది.. కేంద్ర మంత్రులతో దేశవ్యాప్తంగా ఒక కమిటీ వేయాలి.. కమిటీలో కేంద్ర మంత్రులు, సీనియర్ అధికారులు ఉండాలి అని తెలిపారు.
Also Read:శ్రామికుల త్యాగం వెలకట్టలేనిది!

