- Advertisement -
తెలంగాణ కేబినెట్ విస్తరణ ఇప్పట్లో లేనట్లే. మంత్రివర్గంలో తీసివేతలు,కూడికలపై అధిష్ఠానానిదే నిర్ణయం అని తేల్చిచెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రతిపక్ష నేతల కేసుల విషయంలో చట్ట ప్రకారం ముందుకు వెళతాం అన్నారు.
నాకు ఉన్న అవకాశం మేరకు అన్ని సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా పనిచేస్తున్నా అని చెప్పారు. కుల గణన ఆషామాషీగా చేసింది కాదు. ఎంతో పకడ్బందీగా చేశాం అన్నారు. పిసిసి కార్యవర్గ కూర్పు కొలిక్కి వచ్చింది త్వరలో ప్రకటన ఉంటుందన్నారు. రాహుల్ గాంధీ అపాయింట్ మెంట్ కోరలేదు… నాకు రాహుల్ గాంధీకి మధ్య గ్యాప్ లేదు. మా ఇద్దరి మధ్య సాన్నిహిత్యం ఉందన్నారు.
Also Read:జొమాటో ఇకపై ఎటర్నల్…!
- Advertisement -