రేవంత్ రెడ్డికి పదవి గండం?

47
- Advertisement -

రేవంత్ రెడ్డికి సి‌ఎం పదవి మున్నాళ్ల ముచ్చటేనా ? రాబోయే రెండేళ్లలో సి‌ఎం పదవిలో మార్పులు చోటు చేసుకొనున్నాయా ? అంటే అవునేమో అనే సందేహాలు రాక మానవు. తాజాగా ఓ మీడియా చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో సి‌ఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యాలే ఇందుకు కారణం. కాంగ్రెస్ లో పదవుల కొట్లాట తరచూ జరుగుతూనే ఉంటుంది. ఆ మధ్య పీసీసీ పదవి విషయంలోనూ, ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి ఎంపిక విషయంలోనూ హస్తం నేతల కుర్చీలాట గట్టిగానే సాగింది. కానీ మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు ఉండడంతో అధిష్టానం కూడా రేవంత్ రెడ్డి వైపే మొగ్గు చూపి సి‌ఎం పదవి కట్టబెట్టింది. అయితే ప్రస్తుతం సి‌ఎంగా రేవంత్ రెడ్డి ఉన్నప్పటికి ఆ పదవిపై ఇంకా కొంతమంది హస్తం నేతల్లో ఆశ ఉన్నట్లు తెలుస్తోంది.

ఎన్నికల ముందు సి‌ఎం పదవి కోసం భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి వంటి వారు గట్టిగా పోటీ పడ్డారు. వీరంతా ప్రస్తుతం ఆయా శాఖలో మంత్రులు గా కొనసాగుతున్నారు. అయినప్పటికి ముందు రోజుల్లో వీరు సి‌ఎం పదవి కోసం మళ్ళీ ప్రయత్నించే అవకాశాలు ఉన్నాయనేది కొంతమంది అభిప్రాయం. తాజాగా సి‌ఎం రేవంత్ రెడ్డి ఇదే విషయంపై ఇటీవల జరిగిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను పదవిలో ఎన్నాళ్లు కొనసాగిన మంచి పాలన అందించడానికే కృష్టి చేస్తామని, ఒకవేళ తన పదవి రెండేళ్లే అయితే ఈ రెండేళ్లలో ప్రజలు గుర్తించుకునే పనులు చేస్తానని చెప్పుకొచ్చారు. దీంతో సి‌ఎం పదవి విషయంలో మరోసారి పోలిటికల్ హీట్ మొదలైంది. మరి ముందు రోజుల్లో రేవంత్ రెడ్డికి సి‌ఎం పదవిని కాపాడుకోవడం పెను సవాల్ గా మారనుందా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Also Read:నెల రోజుల పాలన సంతృప్తా? అసంతృప్తా?

- Advertisement -