యూపీఎస్సీ చైర్మన్‌తో సీఎం రేవంత్‌ భేటీ

28
- Advertisement -

ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్రమంత్రులను కలుస్తు బిజీగా ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తొలిరోజు ముగ్గురు కేంద్రమంత్రులను కలిసిన సీఎం రేవంత్ ఇవాళ యూపీఎస్సీ ఛైర్మన్ డాక్టర్ మనోజ్ సోనీతో భేటీ అయ్యారు. రేవంత్‌తో పాటు మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, సీఎస్ శాంతి కుమారి, ఉన్నతాధికారులు ఉన్నారు.

టీఎస్పీఎస్సీ ప్రక్షాళనలో భాగంగా యూపీఎస్సీ పనితీరు పరిశీలన, పరీక్షల నిర్వహణ ఇతర అంశాలను అధ్యయనం చేయనున్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు కసరత్తు చేస్తున్నారు రేవంత్.

టీఎస్‌పీఎస్సీపై పలు ఆరోపణల నేపథ్యంలో చైర్మన్‌ జనార్దన్‌ రెడ్డితోపాటు ముగ్గురు సభ్యులు రాజీనామా చేయగా వారి రాజీనామాలను గవర్నర్‌ తమిళిసై పెండింగ్‌లో పెట్టారు. గవర్నర్ అమోదం తెలిపాక కొత్త ఛైర్మన్, సభ్యుల నియామకంతో పాటు ఉద్యోగాల నోటిఫికేషన్లు వెలువరించే ఛాన్స్ ఉంది.

Also Read:జపాన్‌లో భారీ భూకంపం..

- Advertisement -