తెలంగాణ ప్రభుత్వానికి సహకారం అందించేందుకు సుముఖత వ్యక్తం చేశారు సింగపూర్ మంత్రి గ్రేస్ పు హైయిన్. తెలంగాణ రైజింగ్ లక్ష్య సాధనలో భాగంగా భాగస్వామ్యం పంచుకోవాలనే ప్రభుత్వ ఆహ్వానాన్ని పరిశీలిస్తామని హామీ ఇచ్చారు.
ముఖ్యంగా పట్టణాభివృద్ధి ప్రణాళిలు, మౌలిక సదుపాయాల కల్పన, నీటి వనరులు – నిర్వహణ, నైపుణ్యాల అభివృద్ధి, క్రీడలు, సెమీ కండక్టర్లు, తయారీ, పర్యావరణం, స్థిరత్వ, సాంకేతికత సహా వివిధ రంగాలలో తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, భాగస్వామ్యాలపై చర్చలు సానుకూల వాతావరణంలో జరిగాయి.ఈ చర్చల్లో ముఖ్యమంత్రి వెంట ఐటీ & పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు రాష్ట్రానికి చెందిన ఉన్నతాధికారులు, సింగపూర్లో భారత డిప్యూటీ హై కమిషనర్ పూజ పాల్గొన్నారు.
ప్రధానంగా నెట్ జీరో ఫ్యూచర్ సిటీ, మూసీ పునరుజ్జీవన ప్రాజెక్ట్, నీటి నిర్వహణ, స్థిరత్వ ప్రణాళికల్లో తెలంగాణతో భాగస్వామ్యం అంశాన్ని సింగపూర్ ప్రభుత్వం పరిశీలిస్తుందని వారు హామీ ఇచ్చారు. ఉమ్మడి ప్రాజెక్టులపై సాధ్యమైనంత వేగంగా ముందుకు పోవాలని, మరింత సమన్వయంతో పని కలిసి చేయాలని ఇరుపక్షాలు అంగీకరించాయి.
Also Read:నా ఆస్తులు నాకు ఇప్పించండి:మోహన్ బాబు