- Advertisement -
ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో భేటీ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ లో నిర్మించ తలపెట్టిన భారత్ ఫ్యూచర్ సిటీ నుంచి బందరు పోర్ట్ వరకు వయా అమరావతి మీదుగా 12 లేన్ల గ్రీన్‌ఫీల్డ్ రహదారి నిర్మాణానికి వెంటనే అనుమతులు మంజూరు చేయాలని నితిన్ గడ్కరీని కోరారు రేవంత్ రెడ్డి.
రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం కూడా తెలంగాణ-ఏపీ రాజధానుల మధ్య గ్రీన్‌ఫీల్డ్ రహదారి నిర్మించాల్సి ఉందని గుర్తు చేశారు సీఎం.
తెలంగాణకు సముద్ర రేవు లేనందున, బందరు పోర్ట్ వరకు సరకు రవాణాకు వీలుగా గ్రీన్ ఫీల్డ్ రహదారి మంజూరు చేయాలని గడ్కరీకి విజ్ఞప్తి చేశారు.
Also Read:సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారం..సీఐడీ కేసు!
- Advertisement -

