జూమ్ మీటింగ్ లో కాంగ్రెస్ ప్రజాప్రతినిధులకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. జిల్లాల్లోని నాయకులతో ఇంచార్జ్ మంత్రులు అత్యవసరంగా మాట్లాడాలి అని…అభ్యర్థులను ఫైనల్ చేసి బీ ఫారం ఇవ్వాలి అన్నారు. నో డ్యూ సర్టిపికేట్ లు ఇప్పించాలి అని తెలిపారు.
అలాగే లీగల్ సెల్ ను యాక్టివ్ చేయాలి… గాంధీ భవన్ లో లీగల్ టీమ్ తో పాటు సమన్వయం కోసం ఒక టీమ్ అందుబాటులో ఉండాలి అన్నారు. హైకోర్టులో బీసీ రిజర్వేషన్ కేసుపై పీసీసీ అధ్యక్షుడు పర్యవేక్షణ చేయాలి అన్నారు. కోర్టు తీర్పు తరవాత తదుపరి కార్యాచరణ కోసం రాత్రికి మరో సమావేశం ఉటుందని తెలిపారు. తొలి విడత కోసం రాత్రికి అభ్యర్థుల జాబితా సిద్ధం కావాలి అని తెలిపారు.
అభ్యర్థుల ఎంపిక, నామినేషన్లపై ప్రధానంగా చర్చ జరుగగా సమర్థవంతమైన అభ్యర్థులను నామినేషన్ కు ఎంపిక చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.
Also Read:ఓటు చోరి..ప్రత్యేక కార్యాచరణ:మహేష్ కుమార్

