SSMB 29:టైటిల్ ఇదేనా?

8
- Advertisement -

సూపర్ స్టార్ మహేష్ బాబు – రాజమౌళి కాంబోలో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తాత్కాలికంగా SSMB 29 అనే టైటిల్‌తో పిలుస్తున్న ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది. ఇక ఈ సినిమా టైటిల్‌కు సంబంధించి సోషల్ మీడియాలో ఆసక్తికర వార్త చక్కర్లు కొడుతోంది.

గత కొన్ని నెలలుగా మహారాజ్, గ్లోబ్‌ట్రాటర్, GEN63 వంటి అనేక పేర్లు వినిపించగా తాజాగా వారణాసి అనే టైటిల్‌ పేరు ప్రచారంలోకి వచ్చింది. నవంబర్‌లో ఒక భారీ అప్‌డేట్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అయితే తాజా టైటిల్ బజ్ సోషల్ మీడియాలో పెద్ద హల్‌చల్ సృష్టించడంతో, ఈ ఊహాగానాలపై రాజమౌళి స్పందిస్తారా లేదా అనేది ఆసక్తిగా మారింది.

ఈ చిత్రంలో హీరోయిన్‌గా ప్రియాంక చోప్రా నటిస్తున్నారు. దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై కె.ఎల్. నారాయణ ఈ సినిమాను నిర్మిస్తుండగా, సంగీతాన్ని ఎం.ఎం. కీరవాణి అందిస్తున్నారు.

Also Read:ఇందిరమ్మ పాలన కాదు..ఎమర్జెన్సీ:హరీష్

- Advertisement -