Revanth:కమ్యూనిస్టులతో కటిఫ్?

26
- Advertisement -

లోక్ సభ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది తెలంగాణ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. 17 లోక్ సభ స్థానాలకు గాను మెజారిటీ స్థానాల్లో విజయం సాధించాలని బి‌ఆర్‌ఎస్. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు గట్టి పట్టుదలగా ఉన్నాయి. ఇప్పటికే మూడు పార్టీలు కూడా తొలి జాబితా అభ్యర్థులను ప్రకటించాయి. అయితే మూడు ప్రధాన పార్టీలు కూడా ఎలాంటి పొత్తు లేకుండా అభ్యర్థుల ప్రకటన చేశాయి. దీంతో ఈసారి లోక్ సభ ఎన్నికల్లో ఎలాంటి పొత్తు ఉండే అవకాశం లేదా ? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో బి‌ఆర్‌ఎస్ ఒంటరిగా పోటీ చేయగా బీజేపీ జనసేనతో, కాంగ్రెస్ వామపక్షాలతో కలిసి పోటీ చేశాయి . అయితే లోక్ సభ ఎన్నికలకు వచ్చే సరికి బి‌ఆర్‌ఎస్ పార్టీ బిఎస్పీతో పొత్తు పెట్టుకొనున్నట్లు తెలుస్తోంది. బీజేపీ ఎలాంటి పొత్తు లేకుండా సింగిల్ గా బరిలోకి దిగనుంది. .

ఇక కాంగ్రెస్ విషయానికొస్తే కమ్యూనిస్టు పార్టీల విషయంలో ఇంకా ఎటు తేల్చుకోలేకపోతుంది. అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేసినప్పటికీ లోక్ సభ ఎన్నికల్లో వామపక్షలను పక్కన పెట్టేందుకు చూస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఖమ్మం లేదా వరంగల్ సీటు తమకు కేటాయించాలని సీపీఐ డిమాండ్ చేస్తుండడంతో కాంగ్రెస్ ఇంకా తుది నిర్ణయాన్ని వెల్లడించలేదు. పైగా ఖమ్మం మరియు వరంగల్ స్థానాల్లో హస్తం పార్టీకి మంచి పట్టుంది. ఈ స్థానాలను కమ్యూనిస్ట్ పార్టీలకు కేటాయిస్తే బలం తగ్గుతుందనే ఆలోచనలో హస్తం నేతలు ఉన్నట్లు టాక్. మరి ఈ రెండు పార్టీల మద్య సీట్ల కేటాయింపు ఓ కొలిక్కి వచ్చినప్పుడే పొత్తు కొనసాగుతుందా ? లేదా అనే దానిపై క్లారిటీ వస్తుంది. మొత్తానికి లోక్ సభ ఎన్నికలే టార్గెట్ గా పొత్తు అంశం రాష్ట్ర రాజకీయల్లో కొంత చర్చనీయాంశం అవుతోంది. మరి ఏ ఏ పార్టీలు కలిసి ఎన్నికల్లో పోటీ చేయనున్నాయో తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయకతప్పదు.

Also Read:పుచ్చకాయ నిల్వ ఉంచితే.. ప్రమాదమా?

- Advertisement -