పంజాబ్ కు సీఎం రేవంత్

18
- Advertisement -

సీఎం రేవంత్‌ రెడ్డి పంజాబ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. చివరి దశ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ కాంగ్రెస్ ఏర్పాటు చేయనున్న భారీ బహిరంగసభలో పాల్గొని ప్రసంగించనున్నారు రేవంత్. ఈసారి పంజాబ్‌‌లో చతుర్ముఖ పోటీ నెలకనగా కాంగ్రెస్, బీజేపీ, ఆప్, శిరోమణి అకాళీదల్ వేర్వేరుగా పోటీ చేస్తున్నాయి.

గత ఎన్నికల్లో పంజాబ్‌లో కాంగ్రెస్ 13 సీట్లకు గాను ఎనిమిది స్థానాలను గెలుచుకుంది. అకాలీదల్, బీజేపీ రెండేసి స్థానాలను సొంతం చేసుకున్నాయి. ఆప్ ఒక్క స్థానానికి పరిమితమైంది. అయితే ఈ సారి ఆప్ ప్రభుత్వం ఉండటంతో ఆ పార్టీకి మెరుగైన స్థానాలు వస్తాయని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.

ఇక ఇప్పటికే పంజాబ్‌ ఎన్నికల ప్రచారంలో డిప్యూటీ సీఎం భట్టి పాల్గొనగా ఇప్పుడు రేవంత్ రెడ్డి పాల్గొంటుండటం చర్చనీయాంశంగా మారింది. జూన్ ఒకటిన ఏడో దశ ఎన్నికల పోలింగ్ జరగనుంది.

Also Read:Gold Price:లేటెస్ట్ ధరలివే

- Advertisement -