ఇవాళ కర్ణాటకకు వెళ్లనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఉదయం 11.30 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్ట్ నుంచి ఛాపర్లో కర్ణాటకకు బయలుదేరనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమయ్యే సీడబ్ల్యుసీ సమావేశాల్లో పాల్గొంటారు.
ఇవాళ్టి నుంచి కర్ణాటకలోని బెలగావిలో రెండు రోజుల పాటు జరిగే సీడబ్ల్యూసీ సమావేశాలకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి హాజరవుతారు. మహాత్మా గాంధీ ఏఐసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించి వందేళ్లు పూర్తవుతున్న సందర్భాన్ని పురష్కరించుకొని కాంగ్రెస్ పార్టీ ఈ ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తోంది.
కర్ణాటకలోని బెలగావిలోనే ఈ నెల 26, 27 తేదీల్లో రెండు రోజుల పాటు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాన్ని నిర్వహిస్తోంది. ఈ భేటీకి నవ సత్యాగ్రహ బైఠక్ అని పేరు పెట్టింది. సీడబ్ల్యూసీ సభ్యులు, శాశ్వత ఆహ్వనితులు, ప్రత్యేక ఆహ్వనితులు, పీసీసీలు, సీఎల్పీ నేతలు, పార్లమెంటరీ పార్టీ ఆఫీస్ బేరర్లు, సీఎంలు, మాజీ సీఎంలు దాదాపు 200 మంది కీలక నేతలు ఈ సమావేశానికి హాజరవుతున్నారు.
Also Read:TTD: 9న వైకుంఠ ద్వార దర్శనం ఉచిత టోకెన్లు