రేవంత్ విదేశీ ప్రయాణం..పెట్టుబడులు తెస్తారా?

44
- Advertisement -

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి త్వరలో విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత సి‌ఎం రేవంత్ రెడ్డి తొలిసారి చేస్తున్న విదేశీ పర్యటన కావడంతో ప్రస్తుతం ఆయన పర్యటనపై రాష్ట్ర రాజకీయాల్లో ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ విదేశీ పర్యటనలో రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారా అనే చర్చ జరుగుతోంది. గత బి‌ఆర్‌ఎస్ ప్రభుత్వంలో తెలంగాణ ఐటీ రంగంలో విశేష అభివృద్ది సాధించింది. గత ఐటీ శాఖ మంత్రి కే‌టి‌ఆర్.. పెట్టుబడులను ప్రోత్సహిస్తూ హైదరాబాద్ కు ప్రపంచ స్థాయి గుర్తింపు తీసుకొచ్చారు. దాంతో ఐటీ అనగానే కే‌సి‌ఆర్ అనేలా తెలంగాణ ప్రజల్లో సుస్థిర స్థానాని సంపాదించుకున్నారు. మరి ఐటీ రంగాన్ని కే‌టి‌ఆర్ అభివృద్ది చేసిన రీతిలో కాంగ్రెస్ అభివృది చేయగలదా అనే సందేహాలు మొదటి నుంచి కూడా వ్యక్తమౌతూ వస్తున్నాయి.

ఈ నేపథ్యంలో సి‌ఎం రేవంత్ రెడ్డి తొలి విదేశీ పర్యటనపై అందరి దృష్టి నెలకొంది. జనవరి 15 నుంచి 19 మధ్య ఆయన స్విట్జర్లాండ్ లో పర్యటించనున్నారు. అక్కడ జరిగే దావోస్ ప్రపంచ ఆర్థిక సదస్సులో రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. ఆయనతో పాటు ఐటీ మంత్రి శ్రీధర్ బాబు తదితరులు కూడా వెళ్లనున్నట్లు సమాచారం. ఈ విదేశీ పర్యటనలో ప్రముఖ కంపెనీల సీఈఓ లతో కూడా ఆయన సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. మరి రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడంతో సి‌ఎం రేవంత్ రెడ్డి సక్సస్ అవుతారా లేదా అనేది చూడాలి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయా కంపెనీలు రాష్ట్రాన్ని వీడుతున్నట్లు వార్తలు గట్టిగానే వినిపించాయి. ఈ నేపథ్యంలో గత బి‌ఆర్‌ఎస్ పాలనలో జరిగిన ఐటీ అభివృద్ది అలాగే కొనసాగలంటే సి‌ఎం కే‌సి‌ఆర్ ఐటీ రంగంపై గట్టిగా దృష్టి సారించాలనేది కొందరి అభిప్రాయం.

Also Read:దరఖాస్తు ఒకటి.. ప్రశ్నలు ఎన్నో ?

- Advertisement -