రేవంత్ ఢిల్లీ పయనం..క్లారిటీ వచ్చేనా?

41
- Advertisement -

తెలంగాణ సి‌ఎం రేవంత్ రెడ్డి మరియు డిప్యూటీ సి‌ఎం భట్టి విక్రమార్క డిల్లీ బయలుదేరారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఆరు గ్యారెంటీ హామీల దిశగా కాంగ్రెస్ సర్కార్ అడుగులు వేస్తున్న వేళ సి‌ఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి పయనమవ్వడం రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. దీంతో ఈ ఢిల్లీ టూర్ వెనుక ఉన్న అసలు మర్మం ఏంటనే దానిపై జోరుగా చర్చలు జరుగుతోంది. అయితే ఈ ఢిల్లీ టూర్ లో హైకమాండ్ ను కలవడంతో పాటు ప్రధాని మోడీని కూడా సి‌ఎం రేవంత్ రెడ్డి కలిసే అవకాశం ఉన్నట్లు టాక్. రాష్ట్రనికి కొత్తగా ముఖ్యమంత్రి బాద్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి మర్యాద పూర్వకంగా పి‌ఎం మోడీని కలవనున్నారట. రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంపై, అలాగే విభజన హామీలు, తదితర అంశాలను ప్రధానికి సి‌ఎం రేవంత్ రెడ్డి విన్నవించే అవకాశం ఉంది..

ఇకపోతే రాష్ట్రంలో ఆయా పదవుల విషయంలో కాంగ్రెస్ అధిష్టానం తో రేవంత్ రెడ్డి చర్చలు జరిపే అవకాశం ఉంది. ఆల్రెడీ 11 మందికి మంత్రివర్గంలో చోటు కల్పించినప్పటికీ ఇంకా ఆరు మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. అలాగే ఆరు ఎమ్మెల్సీ స్థానాలు, 54 నామినేటెడ్ పోస్టులు కూడా ఖాళీగా ఉన్నాయి. వీటి విషయంలో రేవంత్ రెడ్డి అధిష్టానం తో చర్చలు జరిపే అవకాశం ఉంది. దాంతో ఈ డిల్లీ టూర్ ముగిసిన తరువాత రెండో లిస్ట్ లో ఎవరెవరికి మంత్రి పదవులు కేటాయిస్తారనే దానిపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

అలాగే టీపీసీసీ పదవిలో మార్పుపై కూడా ఈ టూర్ తో క్లారిటీ వచ్చే అవకాశం లేకపోలేదు. ప్రస్తుతం ముఖ్యమంత్రి గాను అలాగే టీపీసీసీ చీఫ్ గాను రేవంత్ రెడ్డే బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అయితే లోక్ సభ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ అటు పార్టీ పరంగా ఇటు ప్రభుత్వ పరంగా రేవంత్ ఒక్కడే చూసుకోవడం కష్టమేనే భావనతో టీపీసీసీ పదవిని వేరొకరికి కట్టబెట్టే ఆలోచనలో అధిష్టానం ఉన్నట్లు వినికిడి. ఇలా వీటన్నిటి విషయంలో రేవంత్ రెడ్డి అధిష్టానం తో చర్చలు జరిపే అవకాశం ఉంది. మరి ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన తరువాత టీ కాంగ్రెస్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.

Also Read:టీఎస్‌పీఎస్సీపై సీఎం రేవంత్

- Advertisement -