ఇందిరమ్మ ఇల్లు.. ఇదేం ఫిటింగూ?

24
- Advertisement -

తెలంగాణలో కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీలలో భాగమైన ఇందిరమ్మ ఇల్లు పథకాన్ని అమలు చేసేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ వడివడిగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే ఆరు గ్యారెంటీలలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్య శ్రీ పెంపు, రూ.500 లకే వంటగ్యాస్, 200 యూనిట్ల ఉచిత కరెంటు వంటి పథకాలను అమల్లోకి తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇక ఈ నెల 11 న ఇందిరమ్మ ఇల్లు పథకాన్ని కూడా ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. అయితే ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు ఆర్థిక సాయం అందిస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఈ పథకానికి ఎవరెవరు అర్హులు ? అనే దానిపై మాత్రం సరైన క్లారిటీ ఇవ్వడం లేదు. ఎన్నికల ముందు ఇల్లు లేని ప్రతి ఒక్కరికి సొంతింటి కలను నెరవేర్చే విధంగా ఇందిరమ్మ ఇల్లు పథకం అందరికీ వర్తిస్తుందని చెప్పిన కాంగ్రెస్ ఇప్పుడు మాట మార్చుతూ ఓ చిన్న మెలిక పెట్టినట్లు తెలుస్తోంది. .

సొంత జాగా ఉన్న పేదలకు మాత్రమే ఈ పథకం వర్తింపజేసే విధంగా కాంగ్రెస్ సర్కార్ అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. అందులోనూ వైట్ రేషన్ కార్డు ఉన్నవారికే మొదటి ప్రాధాన్యత గా అమలు చేయనుంది. ఇక ప్రజా పాలనలో దరఖాస్తు చేసుకున్న వారికి మాత్రమే తొలి దశలో ఇందిరమ్మ ఇల్లు పథకాన్ని అమలు చేయనున్నట్లు సమాచారం. మరి మిగతా వారి పరిస్థితి ఏంటనే దానిపై మాత్రం ఎలాంటి క్లారిటీ లేదు.

దీంతో హామీలు అమలు చేసినట్లే చేసి అందకుండా చేస్తున్నారనే విమర్శ ప్రధానంగా వినిపిస్తోంది. ఆరు గ్యారెంటీలలో భాగంగా ఇప్పటివరకు అమల్లోకి వచ్చిన హామీలన్నిటిని పరిమితి మేరకే అమలు చేస్తోంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ల విషయంలో కూడా పరిమితులు ఉండడంతో ఇదేం పాలన అంటూ ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. రాష్ట్ర ప్రజలందరికీ పథకాలను సవ్యంగా అందించలేనప్పుడు హామీలు ఎందుకివ్వాలనే విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. మొత్తానికి ఆరు గ్యారెంటీల అమలు విషయంలో కాంగ్రెస్ సర్కార్ వ్యవహరిస్తున్న తీరు రాష్ట్ర ప్రజలను కలవర పెడుతున్నట్లే కనిపిస్తోంది.

Also Read:Rajamouli: మహేష్ కోసం రాజమౌళి రిస్క్?

- Advertisement -