ఏపీలో రేవంత్ రెడ్డి .. వేడి పుట్టిస్తారా?

32
- Advertisement -

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 11న ఏపీకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. విశాఖ స్టీల్ ప్లాన్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ నెల 11న విశాఖలో కాంగ్రెస్ ఓ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనుంది. ఈ సభకు రేవంత్ రెడ్డి హాజరు కానున్నట్లు తెలుస్తోంది. ఈ సభలో రేవంత్ రెడ్డితో పాటు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరియు ఇతర జాతీయ కాంగ్రెస్ నేతలు కూడా పాల్గొనే అవకాశం ఉంది, షర్మిల తెలంగాణలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి మరియు ఆమె ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకున్న సంగతి తెలిసిందే. కానీ షర్మిల కాంగ్రెస్ లో చేరి ఏపీలో అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత ఒకరిపై ఒకరు స్నేహపూర్వకంగానే మెలుగుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 11న షర్మిల, రేవంత్ రెడ్డి ఒకే వేధికపై కనిపించడం ప్రాధాన్యం సంతరించుకుంది..

మరి గతంలో విమర్శలు చేసుకున్న వీరిద్దరు ఇప్పుడు. బహిరంగ వేధికపై ఎలా వ్యవహరిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఇకపోతే ఏపీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ తరుపున తాను పాల్గొంటానని గతంలోనే రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో 11న రేవంత్ రెడ్డి ఏపీకి వస్తే జగన్ ప్రభుత్వంపై ఎలాంటి విమర్శలు చేస్తారనేది కూడా ఆసక్తి రేపుతున్న అంశమే. పైగా వైఎస్ జగన్ మరియు రేవంత్ రెడ్డి మధ్య గత కొన్నాళ్లుగా కోల్డ్ వార్ ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి, ఈ నేపథ్యంలో జగన్ పై రేవంత్ రెడ్డి ఎలాంటి వ్యాఖ్యలు చేసిన హాట్ హాట్ డిబేట్లకు దారి తీయడం ఖాయం. ఇకపోతే ఏపీలో వామపక్షాలతో పొత్తు పెట్టుకొని 175 స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేస్తుందని ఇప్పటికే షర్మిల క్లారిటీ ఇచ్చారు. అందుకు సంబంధించి త్వరలోనే అభ్యర్థులను ప్రకటించి ఎన్నికల ప్రచారంలో వేగం పెంచే అవకాశం ఉంది. దీంతో 11 తర్వాత కూడా ఏపీలో రేవంత్ రెడ్డి పలుమార్లు కనిపించే అవకాశం లేకపోలేదు. మరి తెలంగాణలో తన మాటలతో పొలిటికల్ హీట్ పెంచే రేవంత్ రెడ్డి ఏపీలో ఎలాంటి వేడి పుట్టిస్తారో చూడాలి.

Also Read:మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నవీన్ రెడ్డి

- Advertisement -