సిఎం రేవంత్ రెడ్డి డిల్లీ టూర్ రద్దు

53
- Advertisement -

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ రద్దైంది. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాల్లో భాగంగా ఢిల్లీ వెళ్లాల్సి ఉండగా తన పర్యటనను రద్దు చేసుకున్నారు రేవంత్. ఇక ఢిల్లీ పర్యటనలో భాగంగా కేబినెట్ విస్తరణ, ఎమ్మెల్సీల ఎంపికపై చర్చించే ఛాన్స్ ఉంది.

మంత్రిమండలి విస్తరణలో మిగిలిన 6 స్థానాలతో పాటు నామినేటెడ్ పదవుల భర్తీపై చర్చ జరిగే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే ఎన్నికల్లో పోటీ చేసిన ఓడిపోయిన నేతలకు గుర్తింపు ఇవ్వాల్సి ఉంటుంది. పదేళ్ల తరువాత ప్రభుత్వం ఏర్పడటంతో కాంగ్రెస్ పార్టీలో ఆశావహుల సంఖ్య అధికంగానే ఉంది. ఈ నేపథ్యంలో ఎవరికి వారే తమ ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు.

Also Read:పిక్ టాక్ : అందాలతో దుమారం రేపుతోంది

- Advertisement -