రాష్ట్ర గీతం..వివాదంపై రేవంత్ క్లారిటీ

21
- Advertisement -

తెలంగాణ రాష్ట్ర గీతం రూపకల్పనపై నెలకొన్న వివాదంపై క్లారిటీ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. ఢిల్లీలోని తుగ్లక్ రోడ్ 23లో సీఎం అధికారిక నివాసం నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం మీడియాతో చిట్ చాట్‌గా మాట్లాడిన రేవంత్..తెలంగాణ రాష్ట్ర అధికారిక చిహ్నంలో కాక‌తీయ తోర‌ణం ఉండ‌దు అన్నారు. సమ్మక్క – సారక్క, నాగోబా జాతర స్ఫూర్తికి అద్దం పట్టేలా చిహ్నం ఉంటుంద‌న్నారు.

తెలంగాణ గేయానికి సంగీతం సమకూర్చడం సహా మొత్తం వ్యవహారాన్ని అందెశ్రీకే అప్పగించాం అన్నారు. అందెశ్రీనే కీరవాణిని ఎంపిక చేశారని తెలిపారు. తెలంగాణ చిహ్న రూపకల్పన నిజామాబాద్ వ్యక్తికి ఇచ్చామని అన్నారు.

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ఎన్నికల కోడ్ నేపథ్యంలో సమీక్ష జరపలేదన్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పై పోలీసులకు స్వేచ్ఛ ఇచ్చాం. తెలంగాణ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ జరపడం లేదు అన్నారు. తెలంగాణలో ఎన్నికలు పారదర్శకంగా జరిగాయి. ఏ వ్యవస్థను దురుపయోగ పర్చలేదని వెల్లడించారు. అలాగే తెలంగాణలో కరెంట్ కోతలు లేవు అని చెప్పారు.

Also Read:ఐసీఐసీఐకి షాకిచ్చిన ఆర్బీఐ

- Advertisement -