Revanth:రేవంత్ రెడ్డి ప్లాన్ మార్చారా?

39
- Advertisement -

క్యాబినెట్ విస్తరణలో రేవంత్ రెడ్డి ప్లాన్ మార్చారా ? రెండో మంత్రివర్గ విస్తరణ పై ఎందుకు సస్పెన్స్ కొనసాగుతోంది ? అసలు మంత్రివర్గ విస్తరణ ఉంటుందా లేదా ? ఇలా కొన్ని ప్రశ్నలు తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ లో తెగ చెక్కర్లు కొడుతున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత 11 మందికి క్యాబినెట్ లో చోటు కల్పించారు సీఎం రేవంత్ రెడ్డి. ఇంకో ఆరుగురికి క్యాబినెట్ లో చోటు ఉండటంతో వారి ఎంపికపై గత కొన్ని రోజులుగా రకరకాల ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. ఆశవాహులు మంత్రివర్గంలో చోటు కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ప్రో. కోదండరాం, మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, మలిరెడ్డి రంగారెడ్డి, అంజన్ కుమార్ యాదవ్, మధుయాష్కి, వివేక్, బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్.. ఇలా చాలామంది రెండవ మంత్రివర్గంలో చోటు కోసం పోటీ పడుతున్నారు.

కాగా ఇప్పటికే మంత్రివర్గ విస్తరణ పూర్తి చేయాల్సి ఉండగా ఈ విషయంలో రేవంత్ రెడ్డి ప్లాన్ మార్చినట్టు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. మరి కొద్ది రోజుల్లో లోక్ సభ ఎన్నికలు జరగనుండడంతో మంత్రివర్గ విస్తరణను వాయిదా వేసే ఆలోచనలో రేవంత్ రెడ్డి ఉన్నారట. దీనిపై ఇప్పటికే అధిష్టానంతో కూడా చర్చలు జరిపినట్లు వినికిడి. లోక్ సభ ఎన్నికల ముందు మంత్రివర్గ విస్తరణ చేపడితే ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని రేవంత్ రెడ్డి భావిస్తున్నట్లు టాక్. అందుకే ఎన్నికలు పూర్తయిన తర్వాత క్యాబినెట్ విస్తరణ పై దృష్టి సారించే అవకాశం ఉందట. దీంతో మంత్రి పదవి కోసం ఆశగా ఎదురుచూస్తున్న ఆశావాహులు అసంతృప్తికి లోనవుతున్నారట. ఇకపోతే లోక్సభ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు కైవసం చేసుకునేందుకు హస్తం నేతలు అస్త్రశాస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నారు. క్యాబినెట్ విస్తరణ ఇప్పట్లో జరిగే అవకాశం లేకపోవడంతో పూర్తిస్థాయిలో లోక్సభ ఎన్నికలపై దృష్టి సారించేలా హస్తం నేతలు రెడీ అవుతున్నారు. మరి కాంగ్రెస్ వ్యూహాలు ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి.

Also Read:మోడీ సర్కార్ ‘చివరి బడ్జెట్’..అవుతుందా?

- Advertisement -