తెలంగాణ ఆత్మబంధువు మన్మోహన్: రేవంత్ రెడ్డి

9
- Advertisement -

తెలంగాణ ఆత్మబంధువు మన్మోహన్ సింగ్ అని కొనియాడారు సీఎం రేవంత్ రెడ్డి. అసెంబ్లీలో మన్మోహన్ సింగ్ మృతిపై సంతాప తీర్మానం ప్రవేశ పెట్టారు సీఎం రేవంత్. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన..మన్మోహన్‌కు భారత రత్న ఇవ్వాలన్నారు.

ప్రధానిగా తన పదవి కాలంలో ఎన్నో సంస్కరణలు తెచ్చారని..ఆర్థిక సంస్కరణలతో దేశ దశదిశ మార్చారని కొనియాడారు. మన్మోహన్ సింగ్ దేశానికి అందించిన సేవలు మరువలేనివన్నారు. ఆర్థిక రంగంలో మన్మోహన్ దేశానికి మార్గదర్శి అన్నారు.

ఆర్టీఐ, ఉపాధి హామీ చట్టం, ఆధార్ వంటి ఎన్నో సంస్కరణలు తెచ్చారని…దేశాన్ని ప్రపంచానికే ఆదర్శంగా నిలిపారన్నారు. నీతి, నిజాయితీ విషయంలో మన్మోహన్‌ సింగ్‌తో పోటీ పడేవారు నేటి తరంలో ఎవరూ లేరన్నారు. మన్మోహన్ హయాంలోనే 60 ఏళ్ల కల తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని చెప్పారు. మన్మోహన్ సింగ్ పదేళ్లు అద్భుతమైన పాలన అందించారని కొనియాడారు రేవంత్.

Also Read:PSLV C-60:నింగిలోకి పీఎస్ఎల్వీ- సీ 60

- Advertisement -