పదేళ్ళు సి‌ఎం.. రేవంత్ ఓవర్ కాన్ఫిడెన్స్?

33
- Advertisement -

తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత సి‌ఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. తెలంగాణ రెండో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి తన పేరును లిఖించుకున్నారు. అయితే ఆయన సి‌ఎంగా ఎన్నాళ్లు కొనసాగుతారనేది ఎవరు క్లారిటీ గా చెప్పలేని పరిస్థితి. ఇటీవల సి‌ఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మరో పదేళ్ళు తానే ముఖ్యమంత్రిగా ఉంటానని చెప్పుకొచ్చారు. అయితే నిజంగా ఆయన సి‌ఎంగా కొనసాగే పరిస్థితి ఉందా ? అంటే ముమ్మాటికి లేదనే సమాధానాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఈసారి ఎలాగోలా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ మరోసారి అధికారంలోకి రావడం ముమ్మాటికి అసాధ్యమే. ఎందుకంటే ఇచ్చిన హామీలను నెరవేర్చకపోయిన, పాలన విధానం సక్రమంగా లేకపోయిన ప్రజలు తిరస్కరించడం గ్యారెంటీ. పైగా ఈ ఐదేళ్లలో పార్టీలో ఎన్నో మార్పులు చోటు చేసుకునే అవకాశం లేకపోలేదు. .

ఎందుకంటే సి‌ఎం పదవి కోసం ఎన్నికల ముందు దాదాపు అరడజన్ మంది కాంగ్రెస్ నేతలు పోటీ పడ్డారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, సీతక్క.. ఇలా సి‌ఎం రేస్ లో చాలమంది పేర్లే వినిపించాయి. ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క వంటివారు సి‌ఎం పదవి కోసం నేరుగా అధిష్టానంతో సంప్రదింపులు జరిపిన సందర్భాలు అనేకం. కానీ అధిష్టానం రేవంత్ రెడ్డి వైపే మొగ్గు చూపడంతో వారంతా సైలెంట్ కావల్సిన పరిస్థితి ఏర్పడింది.

అయితే మొదటి నుంచి కూడా ఆయా నేతలు రేవంత్ రెడ్డి విషయంలో గుర్రుగానే ఉంటూ వచ్చారు. ఏ చిన్న ఛాన్స్ దొరికిన రేవంత్ రెడ్డిపై ఘాటు విమర్శలు చేస్తూనే వచ్చారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం వారంతా సైలెంట్ గా ఉన్నప్పటికి అన్నీ సర్ధుకున్నాయని భావిస్తే పొరపాటే అంటున్నారు రాజకీయవాదులు. సి‌ఎం పదవి విషయంలో ఏ చిన్న అవకాశం దొరికిన రేవంత్ రెడ్డిని తప్పించేందుకు కొంతమంది కాంగ్రెస్ నేతలు కాచుకు కూర్చున్నారనేది జగమెరిగిన సత్యం. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి సి‌ఎంగా ఐదేళ్లు ఉండడమే గగనం అంటున్నారు కొందరు. మరి పదేళ్ళు సి‌ఎం గా ఉండాలని భావిస్తున్న రేవంత్ రెడ్డి ఆశలు ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి.

Also Read:ఇండస్ట్రీ పై ఆ హీరోయిన్ కామెంట్స్

- Advertisement -