పగుళ్లు లేని పెదాల కోసం…

371
- Advertisement -

పెదల పగుళ్లతో ఇబ్బందులు పడుతున్నారా…అయితే ఈ చిన్న చిట్కాలను పాటించండి. అందమైన పెదాలు మీ సొంతం అవుతాయి.

()పెదాలు బాగా పగిలితే మూడు చెంచాల చక్కెరలో ఒక చెంచా ఆలివ్‌ నూనె, సగం చెంచా కోకో పౌడర్‌, నాలుగు చుక్కల పూదీన రసం కలిపి పెదాలకు పది నిమిషాలు పట్టించి తర్వాత చల్లటి నీటితో కడిగితే మంచి ఫలితం ఉంటుంది. ఇలా వారానికి రెండు సార్లు చేసినా సరిపోతుంది.

()పెదాలు బాగా పొడిబారితే టమాటా రసంలో కొద్దిగా చక్కెర, తేనె కలుపుకొని పెదాలకు పట్టించాలి. ఇలా చేస్తే డిహైడ్రేట్‌ కాకుండా ఉంటాయి. దాంతో పాటు ప్రతిరోజు ఏడు లేదా ఎనిమిది గ్లాసు నీరు తప్పని సరిగా తాగాలి.

Also Read:ఇండస్ట్రీ పై ఆ హీరోయిన్ కామెంట్స్

()గులాబీ రేకులు నూరి తేనె కలిపి ఆ మిశ్రమాన్ని పెదవులకు రాస్తే నలుపు పోతుంది

()పాలమీగడలో గ్లిజరిన్‌ రెండు చుక్కలు కలిపి రాస్తే పెదవులు మృదువుగా ఉంటాయి

() ఆహారంలో బి విటమిన్‌ సి విమిన్‌ జింక్‌గల పదార్తలు తీసుకుంటే పెదవులు పగలవు

Also Read:గ్యాస్ సమస్యలకు ఇలా చెక్ పెట్టండి!

() జాజికాయ పొడి పసుపు నెయ్యి సమభాగములగా తీసుకుని పెదవులకు రాస్తే పగుళ్లుపోతాయి

- Advertisement -