ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తరువాత మహిళా స్వయం సహాయక సంఘాలను పునరుద్ధరించాం.. రాష్ట్రంలో మహిళా శక్తి 67 లక్షల మంది ఉన్నారన్నారు. తెలంగాణలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే మా ప్రభుత్వ లక్ష్యం అన్నారు.
నారాయణపేట జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి . అప్పక్ పల్లిలో జిల్లా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన పెట్రోల్ బంక్ ను ప్రారంభించారు. దేశంలోనే మొదటిసారి మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో పెట్రోల్ బంక్ ను ఏర్పాటు చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఈ ప్రభుత్వంలో మహిళలకే మొదటి ప్రాధాన్యత ఉంటుందని… మహిళలు ఆత్మగౌరవంతో బ్రతుకుతారని మా ప్రభుత్వం ప్రగాఢంగా నమ్ముతోందన్నారు.
త్వరలోనే మహిళా స్వయం సహాయక సంఘాలకు ఏడాదికి రెండు చీరలు కానుకగా ఇవ్వనున్నాం అని… సొంత ఆడబిడ్డలకు అందించినట్లు నాణ్యమైన చీరలను అందించనున్నాం అన్నారు. రూరల్, అర్బన్ అనే తేడా లేదు… తెలంగాణలో మహిళలంతా ఒక్కటే..అవసరమైతే కేంద్రం నుంచి నిధులు తెచ్చుకుందాం అన్నారు.
Also Read:నుమాయిష్.. 247 మంది అరెస్ట్