తెలంగాణ రాష్ట్రం ఢిల్లీ పాలకుల చేతిలో చిక్కుకుందా ? అంటే అవుననే సమాధానాలు ఎక్కువ;గా వినిపిస్తున్నాయి. ఎందుకంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని స్వేచ్చ కొరవడిందనేది చాలమంది చెబుతున్నా మాట. గత బిఆర్‌ఎస్ పాలనలో ఎలాంటి నిర్ణయమైన రాష్ట్రంలోనే కేసిఆర్ కేంద్రంగా జరిగేవి. కానీ ఇప్పుడా పరిస్థితులు కనిపించడం లేదు. ఏ పథకం ప్రవేశ పెట్టాలన్న.. ఏ విధానం అమల్లోకి తీసుకురావాలన్న డిల్లీ వెళ్ళాల్సిందే… అక్కడి హైకమాండ్ తో చర్చించాల్సిందే. దీన్ని బట్టి చూస్తే అధికారం ఇక్కడి నేతలదే అయిన.. పాలన మాత్రం డిల్లీ పాలకుల చేతిల ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత సిఎం రేవంత్ రెడ్డి ఈ రెండు నెలల్లోనే సుమారు 10 సార్లు ఢిల్లీ వెళ్లారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం ఇట్టే అర్థమవుతుంది..
సిఎంగా స్వతంత్ర నిర్ణయాలు కూడా తీసుకోలేని స్థితిలో రేవంత్ రెడ్డి ఉన్నారా ? అనే సందేహాలు రాక మానవు. మంత్రివర్గ విస్తరణ చేయాలంటే ఛలో డిల్లీ, కార్పొరేట్ పదవులు భర్తీ చేయాలంటే కూడా ఛలో డిల్లీ, ఆరు గ్యారెంటీలలో ఏ పథకం అమలు చేయాలన్న ఛలో డిల్లీ, ఇలా ప్రతిసారీ ఢిల్లీ కేంద్రంగా పాలన జరుగుతుండడం చూసి.. రాష్ట్ర పాలకులా ? లేక డిల్లీ బానిసలా ? అనే సందేహాలను వ్యక్తం చేస్తున్నారు రాష్ట్ర ప్రజలు. ప్రస్తుతం మరోసారి డిల్లీ టూర్ లో ఉన్న సిఎం రేవంత్ రెడ్డి డిల్లీ పాలకుల సూచనల మేరకు రాష్ట్రంలో కొత్తగా ఎలాంటి విధానాలు, నిర్ణయాలు తీసుకొనున్నారనేది ఆసక్తికరంగా మారింది.
ఇదిలా ఉండగా సిఎంగా ఈ రెండు నెలల కాలంలో సిఎంగా రేవంత్ పాలనపై సానుకూలతతో పాటు ప్రతికూలత కూడా గట్టిగానే కనిపిస్తోంది. పథకాల అమలుకు వేగంగా అడుగులు వేసినప్పటికీ వాటిని సమర్థవంతంగా అమలు చేయడంలో పరిపాలన లోపం స్పష్టంగా కనిపిస్తోందనేది కొందరి అభిప్రాయం. మరి రేవంత్ ముందు రోజుల్లో కూడా ఢిల్లీ పాలకుల అధీనంలోనే పాలన సాగిస్తారా ? లేదా రాష్ట్ర ప్రయోజనాల నిమిత్తం స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే దిశగా అడుగులు వేస్తారా ? అనేది చూడాలి.
Also Read:ఇంగువతో ఆరోగ్య ప్రయోజనాలు..