ప్రధాని మోడీకి సీఎం రేవంత్ థ్యాంక్స్

11
- Advertisement -

ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి థ్యాంక్స్ చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. వరంగల్ మామునూరు విమానాశ్రయానికి అనుమతి మంజూరు చేసినందుకు తెలంగాణ ప్రజల తరపున ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ప్రత్యేకంగా ధన్యవాదాలు అని ఎక్స్ వేదిగా వెల్లడించారు.

అలాగే కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కే.రామ్మోహన్ నాయుడు, ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకు కూడా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.

శంషాబాద్ విమానాశ్రయం నుంచి 150 కి.మీ పరిధిలో మరో విమానాశ్రయం ఉండకూడదని గతంలో జీఎంఆర్ సంస్థతో ఒప్పందం ఉంది. త్వరితగతిన నిర్మాణ పనులు చేపట్టాలని ఎయిర్ పోర్ట్ అథారిటీని రామ్మోహన్ నాయుడు ఆదేశించారు.

Also Read:ప్రభుత్వంలో ఉన్నాం..పేదవాడి కోసం పనిచేయాలి

 

- Advertisement -