ఈనెల17న హుజుర్ నగర్ కు సీఎం కేసీఆర్

311
cm kcr

ఈనెల 21హుజుర్ నగర్ లో ఉప ఎన్నిక జరుగనున్న సంగతి తెలిసిందే. ప్రచారంలో టీఆర్ఎస్ దూసుకుపోతుంది. ఇంటింటికి తిరుగుతూ టీఆర్ఎస్ అభ్యర్ధి శానంపూడి సైదిరెడ్డి ప్రచారం నిర్వహిస్తున్నారు. గ్రామాలన్ని ఏకధాటిపైకి వచ్చి కారు గుర్తుకే తమ ఓటు అంటూ చెబుతున్నారు. సీఎం కేసీఆర్ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయని నమ్మకంతో ఉన్నారు టీఆర్ఎస్ శ్రేణులు. హుజుర్ నగర్ ఉప ఎన్నికల టీఆర్ఎస్ పార్టీ ఇంఛార్జ్ పల్లా రాజేశ్వర్ ఈరోజు మీడియాతో మాట్లాడారు.

హుజూర్‌నగర్‌లో టీఆర్‌ఎస్‌ గెలుపు ఖాయమని ఆయన అన్నారు. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలే టీఆర్‌ఎస్‌ను గెలిపిస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 17వ తేదీన హుజూర్‌నగర్‌లో సీఎం కేసీఆర్‌ బహిరంగ సభ ఉంటుందని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. ఈ సమావేశంలో ఇక్కడ జరిగే అభివృద్ధి గురించి సీఎం మాట్లాడుతారు. సీఎం బహిరంగ సభకు ప్రజలు భారీగా తరలిరావాలని ఈ సందర్భంగా రాజేశ్వర్‌ రెడ్డి విన్నవించారు.