జీఎస్టీ పై ప్రధాని నరేంద్ర మోడీకి ముఖ్యమంత్రి కేసీఆర్ లేఖ రాశారు. జీఎస్టీతో నష్టం జరుగుతుంది అని తెలిసినా తెలంగాణా ప్రభుత్వం జాతీయ ప్రయోజనాల దృష్ట్యా జీఎస్టీ బిల్లును సమర్థించిందని తెలిపారు. మొట్టమొదలు స్పందించి అసెంబ్లీలో తీర్మానం చేసి పంపింది….జీఎస్టీ ఫలాలు దీర్ఘకాలికంగా ఉండి రాబోయే రోజుల్లో మరిన్ని పెట్టుబడులు రావడానికి దోహదపడుతుందని, ఆస్కారం కలిపిస్తుంది అనుకున్నాం.సీఎస్టీని రద్దు చేసే సమయంలో పూర్తి పరిహారాన్ని అందజేస్తామని అప్పటి యూపీఏ ప్రభుత్వం హామీ ఇచ్చిందని లేఖలో పేర్కొన్నారు సీఎం కేసీఆర్.
రాష్ట్రాలు సీఎస్టీ పరిహారాన్ని తిరస్కరించాయి.తెలంగాణా రాష్ట్రం రూ. 3800 ల కోట్లు నష్టపోయిందని లేఖలో పేర్కొన్నారు.సరిగ్గా ఇదే కారణంపై రాష్ట్రాల ఒత్తిడి మేరకు రెవెన్యూ లాస్ ను పూడ్చడానికి ప్రతి రెండు నెలలకు ఒకసారి పూర్తి జీఎస్టీ పరిహారం చెల్లించే విధంగా జీఎస్టీ పరిహార చట్టాన్ని రూపొందించారు.చట్టంలో అంత ఖచ్చితంగా నిబంధన ఉన్నా జీఎస్టీ పరిహార చెల్లింపుల్లో జాప్యం కొనాగుతోంది.ఏప్రిల్ నెల నుంచి రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారం అందలేదన్నారు సీఎం కేసీఆర్.