తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ ఈసారి ఎన్నికల దృష్ట్యా రెండు స్థానాల్లో పోటీ చేయబోతున్న సంగతి తెలిసిందే. ఒకటి గజ్వేల్ కాగా మరోటి కామారెడ్డి.. 2014లో రాష్ట్రం ఏర్పడినది మొదలుకొని బిఆర్‌ఎస్ అధినేత కేసిఆర్ గజ్వేల్ నుంచే పోటీ చేస్తున్నారు. 2014,2018 ఎన్నికల్లో గజ్వేల్ నుంచి పోటీ చేసి అఖండ విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఈసారి రెండు చోట్ల పోటీ చేస్తుండడంతో అందరి దృష్టి కామారెడ్డిపై పడింది. కామారెడ్డిలో ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న గంప గోవర్ధన్ రెడ్డితో పాటు పలువురు బిఆర్‌ఎస్ నేతలు అధినేత కేసిఆర్ ను పోటీ చేయాలంటూ స్వయంగా కోరడంతో సిట్టింగ్ స్థానమైన గజ్వేల్ పాటు కామారెడ్డిలో కూడా పోటీ చేసేందుకు సిద్దమయ్యారు.
అధినేత తమ నియోజికవర్గంలో పోటీ చేస్తున్నాడని తెలిసి కామారెడ్డి ప్రజలు ఆనందనికి అవధులు లేవు. ప్రకటన వెలువడిన రొజే హర్షధ్వనులతో సంబరాలు చేసుకున్నారు కామారెడ్డి నియోజిక వర్గ ప్రజలు.ఇకపోతే కామారెడ్డి డిగ్రీ కళాశాల స్టేడియం నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కేటిఆర్ మాట్లాడుతూ.. నియోజిక వర్గ ప్రజలు అధినేత కేసిఆర్ పై పెంచుకున్న ప్రేమాభిమానాలను బట్టి చూస్తే దేశంలోనే కనీవినీ ఎరుగని రీతిలో కామారెడ్డి నుంచి కేసిఆర్ అత్యధిక మెజారిటీ సాధించడం ఖాయంగా కనిపిస్తోందని చెప్పుకొచ్చారు. సౌత్ ఇండియాలో ఏ ముఖ్యమంత్రికి సాధ్యంకాని విధంగా హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా కేసిఆర్ నిలవబోతున్నారని.. ఆ రికార్డ్ లో కామారెడ్డి భాగం కావడం సంతోషంగా ఉందని మంత్రి కేటిఆర్ చెప్పుకొచ్చారు. ఇక కామారెడ్డి బరిలో కేసిఆర్ నిలవడంతో ప్రత్యర్థి పార్టీల నుంచి కేసిఆర్ కు పోటీగా బరిలో దిగేందుకు తడబడుతున్నట్లు తెలుస్తోంది.
Also Read:World Cup 2023:నేడే తోలిపోరు.. టీమిండియా గెలిచేనా?