పద్మ అవార్డు గ్రహీతలకు సీఎం కేసీఆర్ విషెస్..

433
kcr
- Advertisement -

పద్మ అవార్డు గ్రహీతలకు శుభాకాంక్షలు తెలిపారు సీఎం కేసీఆర్. తెలంగాణ నుంచి పద్మ పురాస్కారాలు పొందిన పీవీ సింధుతో పాటు కరీంనగర్‌కు చెందిన భాష్యం విజయసారధి,హైదరాబాద్‌కు చెందిన చింతల వెంకట్‌రెడ్డిలను అభినందించారు.

ఆయా రంగాల్లో వారు చేసిన సేవలకు తగిన గుర్తింపు లభించిందన్నారు. వీరు అందరికి రోల్ మాడల్‌గా నిలిచారని చెప్పిన సీఎం …దేశంలో పద్మ అవార్డులు అందుకున్న వారందరికి స్పెషల్ కంగ్రాట్స్‌ చెప్పారు.

ద్రాక్ష పంట సాగుతో వినూత్నమైన మెలకువలతో అద్భుతమైన వ్యవసాయ విధానాలతో గొప్ప దిగుబడులు సాధించారు వెంకట్ రెడ్డి. బ్యాట్మింటన్‌ క్రీడతో తెలంగాణకే కాకుండా దేశానికి పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చింది పీవీ సింధు.ఇక సాహిత్య రంగంలో విజయసారధి చేసిన కృషికి పద్మ శ్రీ వార్డు అవరించింది.

- Advertisement -