యాదాద్రికి సీఎం కేసీఆర్..

43
cm kcr

ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం మరోసారి యాదాద్రిని సందర్శించనున్నారు. ఈ సందర్భంగా అక్కడ జరిగే ఆలయ నిర్మాణ పనులను ఆయన పరిశీలించనున్నారు. అక్టోబర్, నవంబర్ నాటికి పనులు పూర్తి చేయాలని గతంలోనే ఆయన అధికారులను సీఎం ఆదేశించారు. ఈనేపథ్యంలో పనుల పురోగతిని తెలుసుకునేందుకు మరోసారి యాదాద్రికి వెళ్లనున్నారు. కాగా, ఇటీవల ఢిల్లీ వెళ్లిన కేసీఆర్ ప్రధాని మోదీని యాదాద్రి ఆలయ ప్రారంభోత్సవానికి రావాలని సీఎం కేసీఆర్‌ ఆహ్వానించారు.