తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకం పనులను పరిశీలించేందుకు మరోసారి కాళేశ్వరం వెళ్లనున్నారు. ప్రాజెక్టులో కీలకమైన మేడిగడ్డ బరాజ్ పనుల పురోగతితోపాటు ఎస్సారెస్పీ పునర్జీవ పథకం పనులను కూడా పరిశీలించనున్నారు.ఉదయం ప్రగతిభవన్ నుంచి బేగంపేట విమానాశ్రయానికి చేరుకుని, ప్రత్యేక హెలికాప్టర్‌లో జగిత్యాల జిల్లా మల్యాల మండలం రాంపూర్‌కు చేరుకోనున్నారు. అక్కడ నిర్మిస్తున్న మొదటి పంపుహౌస్ పనుల పురోగతిని పరిశీలించనున్నారు.
రాంపూర్ పంపుహౌస్‌లో ఒక మోటరు సిద్ధంకాగా, రెండో మోటరు పనులు చివరిదశలో ఉన్నాయి. ఈ నెలాఖరుకు నాలుగింటిని సిద్ధంచేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. సీఎం కేసీఆర్ తొ లుత ఈ పంపుహౌస్‌లో మోటర్ల బిగింపు పనుల పురోగతిని పరిశీలించనున్నారు. అక్క డి నుంచి బయల్దేరి ఉదయం 7.15 గంటలకు మేడిగడ్డ బరాజ్‌ను పరిశీలిస్తారు. అనంతరం సీఎం అక్కడే అధికారులతో సమీక్షిస్తారని సమాచారం. అనంతరం ఉదయం 11.45 గంటలకు హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణంకానున్నారు.
ఇప్పటికే రాంపూర్ పంప్‌హౌస్‌లో నిర్మిస్తున్న ఎనిమిది మోటర్లకుగాను రెండు మోటర్లను పూర్తిస్థాయిలో బిగించి, ఇటీవలే మొదటి మోటర్‌కు ట్రయల్ రన్‌ను విజయవంతంగా నిర్వహించారు. ఈ నేపథ్యంలో పంప్‌హౌస్ పనుల పరిశీలనకు వస్తున్న సీఎం కేసీఆర్ మొదటి మోటర్ డ్రైరన్‌ను అధికారికంగా ప్రారంభించే అవకాశం ఉన్నదని సమాచారం.