ఢిల్లీ ప్రజలు అదృష్టవంతులు..

52
kcr
- Advertisement -

దేశంలో రాజకీయపరంగా కొన్ని సంచలనాలు జరగాల్సి ఉందని సీఎం కేసీఆర్ అన్నారు. శనివారం సాయంత్రం దక్షిణ మోతీబాగ్‌లోని సర్వోదయ పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్,సీఎం కేసీఆర్ మధ్య సంభాషణ చూద్దాం..

అరవింద్ కేజ్రవాల్:
సీఎం కేసీఆర్ గారు ఎక్సీపీరియన్స్ ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నాను.
కేసీఆర్:
విద్యారంగంలో ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలు చాలా ప్రశంసనీయమైనవి. వాటి ఫలితాలు కనిపిస్తున్నాయి. విద్యార్థులను మార్కులు, నెంబర్ లు అంటూ టెన్షన్ వాతావరణంలో కాకుండా వారిని బిజినెస్ వైపు, వ్యవస్థాపనం వైపు మళ్ళించేలా, ఉద్యోగాల కోసం వేచి చూడకుండా, వారే ఇతరులకు ఉద్యోగాలు కల్పించేలా ఇక్కడి విద్యా విధానం ఉంది. ఇక్కడి విద్యార్థులతో మాట్లాడినపుడు చాలా సంతోషం కలిగింది. వారికి విజయం చేకూరింది. కొందరు పిల్లలు మేము ఎలాన్ మస్క్ కావాలనుకుంటున్నాము అని అంటున్నారు. వారి ఆలోచన విధానమే మారిపోయింది. ఈ రకంగా ప్రభుత్వాలు కార్యాచరణకు పూనుకోవడం భారతదేశంలో కనిపించడం లేదు. ఢిల్లీ ప్రభుత్వం చేపట్టిన చర్యల ఫలితాలు భవిష్యత్తులో ఉత్తమ ఫలితాలనిస్తాయి. కన్నాట్ ప్లేస్ లో కొందరు మహిళలను మీడియా ఇంటర్వ్యూ చేసినప్పుడు తమ పిల్లలను మరో ఆలోచన లేకుండా ఢిల్లీ ప్రభుత్వ స్కూళ్ళలో జాయిన్ చేస్తామని అంటున్నారు. వారికి ఖర్చులు కూడా తక్కువవుతాయని చెప్తున్నారు. బడ్జెట్ కూడా మిగులుతుందని అంటున్నారు. ఇది విని నాకు చాలా సంతోషమైంది. ఈ రోజు స్కూళ్ళను చూసినప్పుడు ప్రశంసాపూర్వకమైన, ఒక అద్భుతమైన కార్యక్రమం జరిగిందని చెప్తున్నాను. ఈ సందర్భంగా ఢిల్లీ ముఖ్యమంత్ర గారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఢిల్లీ ప్రజలు అదృష్టవంతులు, వారికి మంచి సేవలు అందుతున్నాయి. ఇలాంటి ప్రయత్నాలు ప్రతీ చోట జరిగితే దేశానికి మంచి జరుగుతుంది.
రిపోర్టర్:
కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న విద్యా విధాంన పై మీ అభిప్రాయం ఏమిటి?
కేసీఆర్:
ఢిల్లీ ప్రభుత్వం అమలు చేస్తున్న విద్యా విధానాల ఫలితాలు ఇప్పటికిప్పుడే ప్రస్ఫుటమవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఏ విధానమైన రూపొందించవచ్చు. రూపొందించాలి కూడా. కానీ కేంద్ర ప్రభుత్వం ప్రజలను విస్మరించి విధానాలు రూపొందించ కూడదు. మనది ప్రజాస్వామ్య దేశం. రాజ్యాంగంలోని మొదటి పేజీలోనే భారతదేశం రాష్ట్రాల యూనియన్ అని రాయబడింది. ఈ విషయాన్ని మరవకూడదు. అందరి అభిప్రయాలను లెక్కలోకి తీసుకున్నప్పుడే ఆ విధానం విజయవంతమవుతుంది. ఎలాంటి సంప్రదింపులు చేయకుండా విధానాలు రూపొందిస్తే సమస్యలు ఉత్పన్నమవుతాయి.
రిపోర్టర్:
తెలంగాణ ప్రభుత్వం ఈ విధానాన్ని అమలుచేస్తుందా ?
మేము ఆ విధానాన్ని అనుసరించం. మేము టీచర్లు, యూనియన్ లీడర్లను ఇక్కడికి పంపిస్తాం. ఢిల్లీ ప్రభుత్వం ఇక్కడ అనుసరిస్తున్న విద్యా విధానం కోసం ఇతర దేశాలకు వెళ్ళి కరిక్యులమ్, యాక్టివిటీస్ కు సంబంధించి, విద్యార్థులను ఎంటర్ ప్రన్యూర్ లా ఎదిగేందుకు అవసరమైన అంశాలకు సంబంధించి అధ్యయనం చేసింది. కాబట్టీ తక్కువ ఖర్చుతో మేము ఢిల్లీ ప్రభుత్వం ద్వారా ఈ జ్ఞానాన్ని పొందుతాం. ఇందుకు మా సోదరుడు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రవాల్ కు నేను అభినందనలు తెలుపుతున్నాను. ఇది చాలా మంచి కార్యక్రమం. దేశవ్యాప్తంగా ఇలాంటి పనులు జరగాలి.
రిపోర్టర్:
ఏమైనా రాజకీయ చర్చలు జరిగాయా?
కేసీఆర్:
వ్యాపారవేత్తలు కలిసినప్పుడు వ్యాపారపరమైన చర్చలు జరుగుతాయి. రాజకీయ నాయకులు కలిసినప్పుడు రాజకీయపరమైన చర్చలు జరుగుతాయి. ఇందులో ఎలాంటి రహస్యం లేదు. దేశంలో సెన్సేషన్ జరగాలి. జరుగుతుంది. మున్ముందు చూద్దాం ఏం జరుగుతుందో.
మొహల్లా క్లినిక్ సందర్శన అనంతరం
కేసీఆర్:
మొహల్లా క్లినిక్ లు ప్రజలకు మంచి సేవలందిస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం అధికారులను ఇక్కడకి పంపిచింది. వారు ఇక్కడి అధికారులతో మాట్లాడారు. ప్రజల అభిప్రయాన్ని కూడా తెలుసుకున్నారు. వారికి చాలా మంచి సౌకర్యాలు అందుతున్నాయని ప్రజలు చెప్పారు. మొహల్లా దవాఖానలు అనుకరిస్తూ…. హైదరాబబాద్ లో కూడా 350 బస్తీ దవాఖానలు ఏర్పాటు చేశాం. కార్మికులు, పేదవారికి విద్యా , వైద్య సంబంధమైన మంచి సేవలు లభిస్తే దేశం సంక్షేమంలో వర్ధిల్లుతుంది. ఢిల్లీ పట్టణంలో లభిస్తున్న సేవలు ప్రశంసనీయమైనవి. ఇక్కడ విద్యా రంగంలో విద్యార్థులను వ్యవస్థాపకులుగా తీర్చిదిద్దే విధానాలు అమలవుతున్నట్టుగానే, వైద్య రంగంలో టూ టైర్ విధానంలో మొహల్లా క్లినిక్, పాలి క్లినిక్ లు ప్రజలకు టెస్టులు, మందులు, ఇతరత్ర సేవలను అంచెలవారీగా అందిస్తున్నాయి. మొహల్లా క్లినిక లలో ప్రయివేటు డాక్టర్లకు కూడా అవకాశం కల్పించారు. నేనిందాకనే ఒక డాక్టర్ తో మాట్లాడాను. వాళ్ళు ఇందుకు సంతోషంగా ఉన్నారు. ఒక షిఫ్టులో 90 నుండి 110, 120 మంది దాకా పేషెంట్ లు వస్తున్నారు. మంచి క్రమశిక్షణతో వారు పనిచేస్తున్నారు. ఇవ్వాళ గొప్ప విషయాలు చూసే అవకాశం కలిగించి. చాలా మంచి కార్యక్రమాలు ఇక్కడ జరుగుతున్నాయి. ఇందుకు అరవింద్ కేజ్రవాల్ గారికి అభినందనలు తెలుపుతున్నాను. విద్యా, వైద్య రంగాల్లో పేదవారి కోసం అమలుపరస్తున్న కార్యక్రమాలు విజయంతం కావడం పట్ల వారికి అభినందనలు తెలుపుతున్నాను. సాధారణ ప్రజల కోసం పనిచేసి విజయవంతం కావడం కొంచెం కష్టమే ఐనప్పటికీ, ఢిల్లీ ప్రభుత్వం సాధించిన విజయం నిజంగా ప్రశంసనీయమైనది. ఈ కార్యక్రమాలు దేశవ్యాప్తంగా వ్యాపించాలి. దీంతో ప్రజలకు మంచి జరుగుతుంది.
రిపోర్టర్:
విద్య రాజకీయ అంశంగా మారిందా?
కేసీఆర్:
పాలిటిక్స్ వేరు. ఈ పవిత్ర ప్రదేశంలో మేం పాలిటిక్స్ పై మాట్లాడం. వీటి గురించి బయట తర్వాత మాట్లాడుతాను.
అరవింద్ కేజ్రవాల్:
కేసీఆర్ గారిని హృదయపూర్వకంగా స్వాగిస్తున్నాను. వారు ప్రతీ విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రశ్నలు వేసి తెలుసుకున్నారు. ఈ విధంగానే దేశం ముందుకు సాగుతుంది. మేం ఒకరి నుంచి ఒకరం తెలుసుకుంటున్నాం. కేసీఆర్ గారు తెలంగాణలో మంచి పనులు చేస్తున్నారు. మేం వారి నుంచి నేర్చుకుంటున్నాం. ఢిల్లీలో జరుగుతున్న కార్యక్రమాల ద్వారా వారు నేర్చుకుంటున్నారు. ఒకరి నుంచి ఒకరు నేర్చుకున్నప్పుడే దేశం ముందుకు సాగుతుంది. మేం వారిని, వారి మంత్రులు, ఎంపీల టీమ్ ను స్వాగతిస్తున్నాం.
రిపోర్టర్:
రాజకీయపరమైన సంప్రదింపులు నడుస్తున్నాయా?
అరవింద్ కేజ్రివాల్:
మాకు రాజకీయాలు చేయడం రాదు. మాకు స్కూళ్ళు, హాస్పటళ్ళను నిర్మించడమే తెలుసు.

- Advertisement -