కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సీఎం కేసీఆర్

181
cmkcr Thirumala

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ సమేతంగా నిన్న సాయంత్రం తిరుమలకు వెళ్లిన సంగతి తెలిసిందే. తిరుపతికి వెళ్లగానే రేణిగుంట విమానాశ్రయం లో ఆంధ్రా అభిమానులు, పలువురు ప్రజాప్రతినిధులు కేసీఆర్ కు ఘన స్వాగతం పలికారు. ఇవాళ ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు సీఎం కేసీఆర్. నైవేద్యవిరామ సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. అంతకుముందు ఎయిర్ పోర్టులో దిగగానే కేసీఆర్ కు స్వాగతం పలికారు టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్.