సీఎం వెంట వేములవాడకు ఈటెల కుటుంబం..

540
cm kcr
- Advertisement -

ఈ రోజు సీఎం కేసీఆర్‌ కరీంనగర్‌, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో పర్యటించనున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ముందుగా సీఎం కేసీఆర్‌ వేములవాడ ఆయాలన్ని సందర్శించనున్నారు. అయితే వేములవాడ వెళుతూ మేడ్చల్‌లో మంత్రి ఈటెల రాజేందర్ కుటుంబాన్ని బస్‌లో ఎక్కించుకొని తీసుకెళ్లారు సీఎం కేసీఆర్‌. ఈటెల కుమార్తె నీత దంపతులను కూడా తీసుకొని రావాలని సీఎం సూచించడంతో భార్య జమున, కూతురు నీత, అల్లుడు అనూప్ తో కలిసి సీఎంతో పాటు మంత్రి ఈటెల వేములవాడకు వెళ్ళారు.

వేములవాడ చేరుకున్నాక శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో పూజలు నిర్వహించి అనంతరం.. వేములవాడ, మధ్యమానేరు ప్రాంతాల్లో సీఎం పర్యటిస్తారు. ఆతరువాత మధ్యమనేరు ప్రాజెక్టును పరిశీలిస్తారు. అక్కడ నిర్వహించే జలహారతి కార్యక్రమంలో పాల్గొని పూజలు నిర్వహిస్తారు. ఈ పర్యటనలో సీఎం కేసీఆర్ వెంట మంత్రులు కొప్పుల ఈశ్వర్,కేటీఆర్,వినోద్ కుమార్ ఉన్నారు.

- Advertisement -