అనుష్క నిశ్శబ్దానికి అథితిగా ప్రభాస్‌..!

550
prabhas
- Advertisement -

`అరుంధతి`, `బాహుబలి`, `రుద్రమదేవి`, `భాగమతి` వంటి సూప‌ర్‌హిట్ చిత్రాల‌తో తిరుగులేని క్రేజ్‌ను సంపాదించుకుని లేడీ ఓరియెంటెడ్ చిత్రాల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా నిలిచిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తోన్న చిత్రం `నిశ్శ‌బ్దం`. ఈ చిత్రంలో అనుష్క మాట్లాడ‌లేని సాక్షి అనే అమ్మాయి పాత్ర‌లో న‌టిస్తున్నారు. ఇదివరకే విడుదలైన టీజర్‌తో సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. ఈ నేపథ్యంలో అనుష్క అభిమానులంతా ఈ సినిమా కోసం వేయికళ్లతో ఎదురుచూస్తూ ఉండగా, ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించడానికి దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.

Anushka

అయితే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా రెబల్‌ స్టార్‌ ప్రభాస్ రానున్నట్టుగా సమాచారం. ప్రభాస్ – అనుష్క మధ్య మంచి స్నేహం వుంది. ఇద్దరూ కలిసి వరుస సినిమాలో నటించడం వలన ఆ స్నేహం మరింత బలపడింది. అందువల్లనే అనుష్క సినిమా ప్రమోషన్ కి సంబంధించిన విషయం కావడంతో ముఖ్య అతిథిగా రావడానికి ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా చెబుతున్నారు. ఈ వేడుకను ఏ తేదీన నిర్వహించినా .. ఎక్కడ జరిపినా తప్పకుండా వస్తానని ప్రభాస్ మాట ఇచ్చాడని తెలుస్తోంది. హేమంత్ మధుకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను, కోన వెంకట్ తో కలిసి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మించారు.

- Advertisement -