- Advertisement -
జనవరి 1,2వ తేదిన తెలంగాణలో ప్రాజెక్ట్ లను పరిశీలించనున్నారు సీఎం కేసీఆర్. పాలమూరు రంగారెడ్డి, డిండి ప్రాజెక్టు పనులు జరిగే ప్రాంతాలను సీఎం కేసీఆర్, రిటైర్డు ఇంజినీర్ల బృందం సందర్శించనుంది. జనవరి 2న కాళేశ్వరం ప్రాజెక్టుతో ఎస్ఆర్ఎస్పీకి నీరందించే పునర్జీవన పథకం పనులను సీఎం సందర్శించనున్నారు. రాజేశ్వరరావుపేట, రాంపూర్లలో నిర్మాణంలో ఉన్న పంప్ హౌస్‌లను సీఎం పరిశీలించనున్నారు. డిసెంబర్ 31న రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ శ్యాంప్రసాద్‌రెడ్డి ఆధ్వర్యంలో మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీలు పంపుహౌజుల నిర్మాణ పనులను తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్ల బృందం పరిశీలించనుంది. అదే రోజు సాయంత్రం ప్రాజెక్ట్ ల పురోగతిని సీఎం కేసీఆర్ కు వివరిస్తారు.
- Advertisement -