సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలంటే దశాబ్దాలు పట్టే దేశంలో రొండు మూడేండ్లలోనే కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా పలు బ్యారేజీలను అత్యంత క్లిష్టమైన ఎత్తిపోతల నిర్మాణాలను విద్యుత్ సబ్ స్టేషన్లను పూర్తిచేస్తుండడంతో ప్రపంచం తెలంగాణ వైపు చూస్తున్నదని, వలస పాలనలో నత్తనడకన నడిచిన తెలంగాణ సాగునీటి ప్రాజెక్టుల పనులు స్వయంపాలనలో యుద్దప్రాతిపదికన పూర్తికావస్తుండడం గొప్ప విషయమని సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణ రైతుకు సాగునీటిని అందించాలనే ప్రభుత్వ ప్రధాన ప్రాధాన్యతకు తగ్గట్టుగానే సాగునీటిశాఖ ఇంజనీర్లు అధికారులు నిపుణులు పని చేస్తండడం గొప్ప విషయమన్నారు. అందరి సమిష్టి కృషి వల్లనే కాళేశ్వరం వంటి గొప్ప ప్రాజెక్టులు నిర్మాణం ముగింపు దశకుచేరుకున్నాయని సీఎం అభినందించినారు.
మరికొద్ది రోజుల్లో వానలు కురిసి వాగులు వంకలు పొంగి, గోదావరి నదీ జల ప్రవాహం సాగనున్న నేపథ్యంలో అక్కడక్కడ మిగిలి వున్న ప్రాజెక్టు పనులను యుద్దప్రాతిపదికన పూర్తిచేయాలని, వీలయినంత త్వరలో కాళేశ్వరం ప్రాజెక్%9