చేప ప్రసాదం పంపిణీకి ఏర్పాట్లు పూర్తి చేయాలి..

274
- Advertisement -

నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో ఈ నెల 8వ తేదీన జరగనున్న చేప ప్రసాదం పంపిణీ జరగనుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పరిశీలించారు. అనంతరం వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిహెచ్ఎంసి మేయర్ బొంతు రామ్మోహన్,జిహెచ్ఎంసి కమిషనర్ దాన కిషోర్, పలువురు కార్పొరేటర్లు, బత్తిని హరినాథ్ గౌడ్ సోదరులు, కుటుంబ సభ్యులు హాజరైయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో గత 5 సంవత్సరాలుగా చేప ప్రసాదం పంపిణీకి మంచి ఏర్పాట్లు చేస్తున్నాం. వరుసగా వస్తున్న ఎన్నో పండుగలు, కార్యక్రమాలకు అధికారులు మంచి ఏర్పాట్లు చేస్తున్నారు. ఆస్తమా వ్యాధిగ్రస్తులు ఈ చేప మందు తీసుకుంటే తగ్గుతుంది అని దేశంలోని వివిధ ప్రాంతాల ప్రజల నమ్మకం. అందుకే 2, 3 రోజుల ముందే మన హైదరాబాద్‌కు చేరుకుంటారు. వారికి తగిన సౌకర్యలు అందించాలని అధికారులను ఆదేశించారు. వృద్ధులు, వికలాంగులకు, చిన్నపిల్లలకు ప్రత్యేక క్యూ లైన్ ఏర్పాటు చేయాలని.. వాలంటీర్లను ఉపయోగించుకొని విజయవంతంగా కార్యక్రమాన్ని నిర్వహించాలని మంత్రి తలసాని అన్నారు.

Talasani Srinivas
మేయర్ బొంతు రామ్మోహన్‌ మాట్లాడుతూ.. హైదరాబాద్ నగరంలో ప్రతి సంవత్సరం చాప ప్రసాదం కోసం ఇతర రాష్ట్రాల నుండి వేల సంఖ్యలో ప్రజలు వస్తున్నారు. గతంలో జరిగిన ఇబ్బందులు, సమస్యలను పరిష్కరించుకుంటు.. వచ్చిన వారి కోసం మంచి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. గతంలో జరిగిన అగ్నిప్రమాద ఘటన దృష్ట్యా ఫైర్ డిపార్ట్మెంట్ అప్రమత్తంగా ఉండాలి. వృద్దులకు, వికలాంగులకు ప్రత్యేక క్యూలైన్ తో పాటు మిగిలిన సౌకర్యాలు కల్పించాలి. తాగునీటి సరఫరా అంశంలో జాగ్రత్తలు పాటించాలని ఆయన తెలిపారు.

జిహెచ్ఎంసి కమిషనర్ దానకిషోర్ మాట్లాడుతూ.. మన నగరానికి మంచి పేరు తీసుకువచ్చే కార్యక్రమం ఇది. గత ఎన్నో సంవత్సరాల నుండి బాగా నిర్వహిస్తున్నాం. వాటర్ బోర్డ్ నుండి వీలైనంత ఎక్కువగా నీరు అందిస్తాం. శానిటేషన్ క్లీనింగ్ కోసం అదనంగా సిబ్బందిని ఏర్పాటు చేస్తున్నాం అన్నారు.

చేప ప్రసాదం పంపిణీ నిర్వాహకులు బత్తిని హరినాథ్ గౌడ్ మాట్లాడుతూ.. ఏ ప్రభుత్వం చేయనంతగా ఈ తెలంగాణ ప్రభుత్వం మాకు సహాయం చేస్తుందన్నారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి పోలీసులు, అన్ని శాఖల అధికారులు కూడా ఎంతో కష్టపడుతున్నారు. గత ఏడాది చాలా చిన్న చిన్న చేప పిల్లలు ఇచ్చారు. ఈసారి కొంత పెద్ద చేప పిల్లలు ఇవ్వాలని మత్స్య శాఖను కోరుతున్నామన్నారు.

- Advertisement -