దేశంలోనే తొలిసారి…20 వేల మందితో వీడియో కాన్ఫరెన్స్‌

312
kcr
- Advertisement -

దేశ చరిత్రలో ఎప్పుడూ లేనివిధంగా భారీ వీడియో కాన్ఫరెన్స్‌ను నిర్వహించనున్నారు సీఎం కేసీఆర్. మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్‌ నుండి జరిగే ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో గ్రామ స్ధాయి నుండి రాష్ట్రస్ధాయి వరకు 20 వేల మంది పాల్గొననున్నారు.

మంత్రుల నుంచి.. ఏఈవోల వరకు…32 కలెక్టరేట్లు అన్ని మండల కేంద్రాల్లో అధికారులు పాల్గొనే ఈ సమావేశంలో నియంత్రిత పంటలసాగుపై దిశానిర్దేశం చేయనున్నారు సీఎం.

గ్రామీణస్థాయిలో పరిస్థితులపై అధికారులు ఇచ్చే సమాచారం ఆధారంగా సీఎం కేసీఆర్‌ తగిన సూచనలు చేస్తారు. రాష్ట్రంలో సాగుభూమి విస్తీర్ణం 1.10 కోట్ల ఎకరాలకు పైగా చేరడంతో రైతులకు లాభాలు వచ్చేలా చేయడంపై ముఖ్యమంత్రి కసరత్తు మొదలుపెట్టారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో సాగయ్యే భూమిలో 50 లక్షల ఎకరాల్లో వరి, మరో 50 లక్షల ఎకరాల్లో పత్తి, మరో 10 లక్షల ఎకరాల్లో కంది పంట పండించాలని నిర్ణయించారు. దీనిని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివరించనున్నారు సీఎం.

- Advertisement -