గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం కేసీఆర్

95
kcr
- Advertisement -

జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు సీఎం కేసీఆర్. సికింద్రాబాద్ గాంధీ దవాఖానాలో విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం నివాళులు అర్పించి సర్వమత ప్రార్ధనల్లో పాల్గొన్నారు. ధ్యాన భంగిమలో కూర్చున్న మహాత్మాగాంధీ కాంస్య విగ్రహాన్ని ప్రభుత్వం రూ.1.25కోట్లతో గాంధీ దవాఖాన ప్రవేశద్వారం ఎదుట ఏర్పాటు చేసింది. 16 అడుగుల ఎత్తుతో, 5 టన్నుల బరువుతో ఈ విగ్రహాన్ని రామ్‌ సుతార్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ వారితో హెచ్‌ఎండీఏ అధికారులు నెలకొల్పారు.

గాంధీజీ 153వ జయంతి సందర్భంగా సీఎం కేసీఆర్‌ నివాళులు అర్పించారు. సికింద్రాబాద్‌ ఎంజీ రోడ్డులో ఉన్న మహాత్మా గాంధీ విగ్రహం వద్ద ముఖ్యమంత్రి పుష్పాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు హరీశ్‌ రావు, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌‌, మేయర్‌ విజయలక్ష్మి, ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేశ్‌, మాగంటి గోపీనాథ్‌, ముఠా గోపాల్‌ పాల్గొన్నారు.

- Advertisement -